
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ వెండితెర పునరాగమనానికి సర్వం సిద్దమై ఇప్పటికే బాలీవుడ్ చిత్రం `పింక్` సినిమా తెలుగు రీమేక్ కి రడీ అయిపోయారు. సినిమా వార్తలు రానప్పటికీ ఆయన షూటింగ్ మాత్రం సైలెంట్‌గా పూర్తి చేసేస్తున్నారు. తాజాగా పవన్‌కల్యాణ్ నటించ బోయే మరో సినిమా ఎ.ఎం.రత్నం నిర్మిస్తుండగా, ఈ చిత్రం కోసం హైదరాబాద్ పమీపంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేశారట.
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 4 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని ఫిలింనగర్ టాక్. ఈ చిత్రం తొలి షెడ్యూల్ లో పవన్‌తో సంబంధంలేని సన్నివేశాలను చిత్రీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ లోపు పవన్ `పింక్` రీమేక్‌లో తన పార్ట్‌ను పూర్తి చేసేసుకుంటాడని సమాచారం. పీరియాడికల్ డ్రామాగా సాగే ఈ చిత్రంలో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. కాగా. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ ను హీరోయిన్ గా నటించనున్నట్టు వినవస్తోంది.


