Allఆంధ్రప్రదేశ్వార్తలు

పృథ్వీ క్షమాపణ చెప్పాలి ! …పృథ్వీరాజ్‌పై పోసాని ఫైర్

  
ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్‌పై నటుడు పోసాని కృష్ణ మురళి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజధాని రైతుల్ని పెయిడ్‌ ఆర్టిస్టులు అనడం సరైంది కాదని వార్నింగ్ ఇచ్చారు. 3 పంటలు పండే భూముల్ని రాజధాని కోసం వదులుకున్నారని, రైతులు చొక్కా, ప్యాంట్లు వేసుకోకూడదా? అని పోసాని ప్రశ్నించారు. రైతుల్ని పెయిడ్‌ ఆర్టిస్టులు అన్న పృథ్వీ సిగ్గుపడాలన్నారు. ఎవరు పెయిడ్‌ ఆర్టిస్టులు? అమరావతి ఆడపడుచులా? అమరావతిలో ఉన్న కమ్మ వాళ్లా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆడపడుచులకు పృథ్వీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదేళ్ల ప్రభుత్వాన్ని 6 నెలలు కాకుండానే భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్‌ను అన్‌పాపులర్‌ చేయడానికి పృథ్వీ ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డి గాడు అని ఆడవాళ్లు తిడుతున్నారంటే.. అది పృథ్వీలాంటి వాళ్ల వల్లేనని చెప్పారు.
పృథ్వీ ఎవరి తరపున మాట్లాడారో చెప్పాలని పోసాని నిలదీశారు. పృథ్వీ వ్యాఖ్యలను మంత్రులు సమర్థిస్తే ఇక తాను మాట్లాడనని, తన దారి తాను చూసుకుంటానని సూచించారు. పృథ్వీలాంటి సినిమా వాళ్లు మూడు, నాలుగేళ్లలో వచ్చి చేరారని చెప్పారు. తనతో పాటు ఎమ్మెల్యే రోజా పదేళ్ల నుంచి ఉన్నామని చెప్పుకొచ్చారు. రైతులంటే అడుక్కుతినే వాళ్లే ఉంటారా? ఆత్మాభిమానం ఉన్న రైతుల్ని అవమానిస్తారా? అని నిలదీశారు. 30 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు ఎంత ఆవేదన ఉంటుందో గుర్తుంచుకోవాలని హితవు పలికారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker