Allముఖ్యాoశాలు

ఈరోజే సూర్య గ్రహణం.. ఈ రాశులవారికి శుభమట




డిసెంబర్ 26వ తేదీన ఈ ఏడాదిలో చివరి గ్రహణం ఏర్పడుతోంది. భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళరేఖపై రావడం వల్ల గ్రహణాలు ఏర్పడుతాయి. భూమికి ఇరువైపులా సూర్యుడు, చంద్రులు సంచరిస్తుంటారు. మధ్యలో భూమి ఉంటుంది.  ఈ మూడూ ఒకే సరళరేఖపైకి చంద్రుడి మధ్యలో ఉండి ఆ ఆ నీడ సూర్యుడిపై పడి పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ కనిపించకపోవడాన్ని సూర్యగ్రహణం అంటారు. ఇది అమావాస్య రోజున సంభవిస్తుంది. కానీ, అన్ని అమావాస్యల్లో సూర్యగ్రహణాలు ఏర్పడవు. సాధారణంగా సంవత్సరానికి ఐదు నుంచి ఏడు గ్రహణాలు ఏర్పడతాయి. ప్రతి పదేళ్లకు గ్రహణాలు ఏ వరుస క్రమంలో ఏర్పడ్డాయో అదే వరుస క్రమం పునరావృతం అవుతుంది. కానీ ఈసారి ఏర్పడే కంకణాకార కేతుగ్రస్త గ్రహణం తిరిగి 16 ఏళ్ల తర్వాత సంభవించనుంది. సూర్యహణం మార్గశిర బహుళ చతుర్దశి మూల నక్షత్రం ధనుస్సు రాశిలో ఏర్పడుతుంది. కాబట్టి కర్కాటకం, తుల, కుంభం, మీన రాశుల వారికి శుభం.. మేషం, వృషభ, మిథున, సింహ రాశుల వారికి మధ్యమంగా వుంటుంది. కానీ కన్య, వృశ్చిక, ధనుస్సు, మకర రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. గ్రహణం పట్టగానే నదీ స్నానం ఆచరించి, నదీ తీరాన జపం చేసుకుంటే ఫలితం ఎక్కువగా ఉంటుందని అంటారు.


గ్రహణ స్పర్శ కాలంలో నదీస్నానం, మధ్యకాలమున తర్పణం, జపం, హోమం, దేవతార్చన, విడుపు కాలంలో దానం, స్నానం చేయడం మంచిది. గ్రహణ కాలంలో భాగవన్నామస్మరణ చేయటం ఉత్తమం. గురువు ఉపదేశించిన మంత్ర జపం, వశీకరణం, శత్రుపీడనం నుంచి విముక్తి లభించేందుకు, మనసు ప్రశాంతంగా ఉండేందుకు గాయత్రి మంత్ర జపం, ఏడురోజుల వరకు తప్పనిసరిగా ఆచరించాలి. ఈనెల 26, గురువారం నాడు సూర్యగ్రహణం సంభవించనుండటం, ఇది దేశమంతా కనిపించనుండటంతో, రాహుకేతు పూజలు జరిపే శైవక్షేత్రాలు మినహా మిగతా అన్ని దేవాలయాలూ మూతబడనున్నాయి. ఈ గ్రహణంపై పంచాంగకర్తలు వివరణ ఇస్తూ, ఏ రాశివారికి మేలు కలుగుతుంది, ఏ రాశి వారికి ఎటువంటి ప్రభావం ఉంటుందన్న అంశంపై వివరణ ఇస్తున్నారు. ఈ గ్రహణం, స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ వికారి నామ సంవత్సరం మార్గశిర బహుళ అమావాస్య నాడు, మూలా నక్షత్రంలో ధనస్సు రాశియందు తీపాధాధిక కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణంగా సంభవించనుంది. గ్రహణ సమయం విషయానికి వస్తే, ఉదయం 8.07కు ప్రారంభమవుతుందని, 9.31 గంటలకు మధకాలమని, 11.20కి ముగుస్తుందని, మొత్తం 3.09 గంటల పాటు గ్రహణం ఉంటుందని అంటున్నారు.


 ఇక ఈ గ్రహణం వృషభం, కన్య, తుల, కుంభ రాశులవారికి శుభ ఫలితాలను అందిస్తుందని చెబుతున్నారు. ఇదే సమయంలో మేషరాశి వారికి చింత, మిధున రాశి వారికి స్త్రీ కష్టం, కర్కాటక రాశి వారికి అతి కష్టం, సింహ రాశి వారికి అశాంతి, వృశ్చిక రాశి వారికి ధన వ్యయం, ధనస్సు రాశి వారికి ప్రాణహాని, మకర రాశి వారికి ఆరోగ్య హాని, మీన రాశి వారికి మనోవ్యధను కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు. గ్రహణ సమయంలో దైవారాధనతో చెడు ఫలితాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.


 ఇక ఖగోళ శాస్త్రవేత్తలు, ఈ గ్రహణం కంకణాకారంలో ఏర్పడుతుంది కాబట్టి, చూసేందుకు అద్భుతంగా ఉంటుందని, అయితే, కళ్లకు హాని కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకుని చూడాలని సూచిస్తున్నారు. గ్రహణాన్ని వీక్షించేందుకు ఇండియాలోని పలు సైన్స్ మ్యూజియాలు, ప్లానిటోరియాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker