జాతీయ వార్తలుముఖ్యాoశాలు
రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ నేడు

భారతదేశం 15వ రాష్ట్రపతిని ఎన్నుకోనుంది. ఈ నేపధ్యంలో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము స్వస్థలమైన ఒడిశాలోని రాయంగ్‌పూర్‌లో వేడుకలు ప్రారంభమయ్యాయి. యశ్వంత్ సిన్హాపై పోటీలో ముర్ము విజయం సాధించాలని ఆమె స్వస్థలానికి చెందిన వారంతా కోరుకుంటున్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత స్వీట్లు పంపిణీ చేసేందుకు రాయంగ్‌పూర్ గ్రామ ప్రజలు ఏర్పాట్లు చేశారు.ఉదయం 11 గంటలకు పార్లమెంటులో కౌంటింగ్ ప్రారంభంకానుంది. కౌంటింగ్ ముగిసిన వెంటనే ఫలితాలు వెల్లడి కానున్నాయి. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలకు ఓటింగ్ జరిగింది.ముర్ము గతంలో జార్ఖండ్ గవర్నర్‌గా ఒడిశాలో మంత్రిగా పనిచేశారు. ముర్ము ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆమె భారతదేశానికి మొదటి గిరిజన రాష్ట్రపతి కావడంతో పాటు దేశానికి రెండవ మహిళా రాష్ట్రపతి అయిన ఘనత సాధిస్తారు.




