తెలంగాణ
ఎల్లమ్మ పోచమ్మ దేవాలయాన్ని సందర్శించిన వసుంధర దేవి

హిందూపూర్ ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సతీమణి
వసుంధర దేవి శుక్రవారం నాడు ఎల్లమ్మ పోచమ్మ దేవాలయాన్ని
సందర్శించారు సనత్ నగర్ లోని బల్కంపేట టెంపుల్ ను సందర్శించిన
వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికి ఆలయం విశిష్టతను పూజా విధానాన్ని
వారికి వివరించారు ఆలయ కమిటీ సభ్యులు ఎం హనుమంతరావు సీనియర్
అసిస్టెంట్ సాయి శంకర ప్రసాద్ వారికి గుడి విశిష్టతను మరియు గుడిలో జరిగే
ప్రతి పూజా విధానాన్ని గురించి వివరించడం జరిగింది వారిని ఆహ్వానించడం
మొదలు వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు అయితే నందమూరి బాలకృష్ణ
సతీమణి వసుంధర దేవి దేవాలయంలోని అమ్మవారి విగ్రహాల దగ్గర ప్రత్యేక పూజలు
నిర్వహించి పాలక మండల సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో పాలక మండల సభ్యులు హనుమంతరావు పాల్గొన్నారు




