తెలంగాణముఖ్యాoశాలు
విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత…..చికిత్స చేసిన తెలంగాణ గవర్నర్ తమిళసై

విమానం లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు అర్థరాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
విమానం గాల్లో ఉన్న సమయంలో ప్రయాణికుడికి చెస్ట్ పెయిన్, ఇతర సమస్యలతో బాధపడ్డాడు.
దీంతో అప్రమత్తం అయిన విమాన సిబ్బంది ఆ విమానంలో ఎవరైనా డాక్టర్లు ఉన్నారా అని అనౌన్స్ చేశారు.
అదే విమానంలో ప్రయాణిస్తున్న గవర్నర్ తమిళసై వెంటనే స్పందించి ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రయాణికుడికి భరోసా ఇచ్చి ఉపశమనం కలిగించారు. వెంటనే కోలుకున్న ప్రయాణికుడు చికిత్స అందించిన గవర్నర్కు కృతజ్ఞతలు తెలిపాడు. ఇతర ప్రయాణికులు కూడా గవర్నర్ను ప్రసంసించారు. అలాగే సరైన సమయంలో స్పందించిన విమాన సిబ్బందిని గవర్నర్ అభినందించారు




