తెలంగాణ
జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

జీడిమెట్ల పారిశ్రామికవాడలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. విశిష్ట ల్యాబ్లో పెద్దఎత్తు
మంటలు చెలరేగాయి. మంటలకు ల్యాబ్లో కెమికల్ డబ్బాలు పేలాయి. రేకులు ఎగిరిపోయాయి.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని రెండు ఫైరింజన్లతో
మంటలను అదుపు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.మంటల
తాకిడికి ఎవరైనా చనిపోయి ఉంటారా అసలు లోపల ఎంతమంది ఉన్నారు అనేది మిస్టరీగానే ఉంది


