తెలంగాణ

అమిత్‌షాను మర్యాద పూర్వకంగా కలిశా….. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

కేంద్రమంత్రి అమిత్‌షాను మర్యాద పూర్వకంగా కలిశానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.
 ఈ సందర్బంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారతానని తనపై దుష్ప్రచారం
చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కుటుంబ పరిపాలన అయిపోయిందని అందుకనే సీఎం కేసీఆర్‌ కుటుంబ అవినీతిపై తాను రాజీలేని పోరాటం చేస్తున్నానని అన్నారు.
 రాజకీయంగా తనను దెబ్బతీసేందుకే కుట్రలు చేస్తున్నారని, తన కార్యకర్తలను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం
 చేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తలతో చర్చించకుండా ఏ నిర్ణయం తీసుకోనని ఆయన స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ నేతల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపిచ్చారు. సీఎం కేసీఆర్‌ అవినీతిపై బహిరంగ యుద్ధం చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker