జాతీయ వార్తలు
దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం

దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో
ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ముర్ముతో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం చేయించారు.
రాష్ట్రపతితో ప్రమాణం చేయించిన తొలి తెలుగు సీజేఐగా ఎన్వీ రమణ చరిత్ర సృష్టించారు.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, స్పీకర్ ఓంబిర్లా..
కేంద్రమంత్రులు, ఎంపీలు, గవర్నర్లు, సీఎంలు,రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి ఏపీ
తెలంగాణ నుండి కూడా ముఖ్య నేతలు వెళ్లారు సుప్రీం కోర్ట్ జస్టిస్ ఎన్వి రమణ కు
15వ రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించే అదృష్టం కలిగిందని చెప్పుకోవాలి
ఈ కార్యక్రమానికి త్రివిధ దళాల అధికారులు హాజరయ్యారు.




