ఆంధ్రప్రదేశ్ముఖ్యాoశాలు

మంజూరైన గృహాలు 69,300…..పూర్తయ్యింది రెండు వేలే…….!ప్రారంభమేకాని 35వేల ఇళ్లు

జగనన్న కాలనీలో హాస్యంగా మిగిలిపోయాయి చెప్పేదొకటి  చేసేది ఒకటి ప్రజలను మోసం
చేస్తూ వారి నుంచి డబ్బులు కట్టించుకుంటూ మధ్యలో పెట్టి కట్టిన డబ్బులు ఇవ్వబంటు ప్రజలను పీడిస్తున్నారు
అవసరం వచ్చినప్పుడు అల్లా ప్రజలను మభ్య పెట్టడానికి ఒక జోకులా తయారయింది జగన్ అన్న ఇల్లుప్రభుత్వం
జగనన్న కాలనీల పేరుతో. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలంతోపాటు పక్కా గృహం
మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంతో పేదలు ఆనందించారు. సొంతింటి కల నెరవేరుతుందని ఆశపడ్డారు. కానీ కొద్ది
నెలల్లోనే అది ఆవిరైంది. ఊరికి దూరంగా వాగుపోరంబోకు భూములు, కొండలు, గుట్టల్లో స్థలాలు ఇవ్వడంతో అక్కడ ఇళ్లు
నిర్మించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అనేక చోట్ల కొద్దిపాటి వర్షానికే జగనన్న కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు
మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. వీటికితోడు గృహ నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరగ్గా ప్రభుత్వం మాత్రం యూనిట్‌ విలువను
రూ.1.80లక్షలకు తగ్గించింది. పొదుపు మహిళలకు ఇస్తామని చెప్పిన రూ.30వేల రుణం కూడా సక్రమంగా అందడం లేదు. దీంతో వేలాది
పక్కా గృహాలు ప్రారంభానికి నోచుకోకపోగా, మంజూరు చేసిన వాటిలో అత్యధికం పునాదులకే పరిమితమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker