ఆంధ్రప్రదేశ్ముఖ్యాoశాలు

8 గంట‌లు ఎందుకు ప‌నిచేయ‌రు…. మంత్రి బొత్స ఆగ్ర‌హం

ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, వారికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్న పీడీఎఫ్ ఎమ్మెల్సీలపై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అనుకున్న‌వ‌న్నీ కావాల‌ని డిమాండ్ చేస్తున్న ఉపాధ్యాయులు… ప్ర‌భుత్వం కోరుతున్న‌ట్లుగా 8 గంట‌ల పాటు ఎందుకు ప‌నిచేయ‌ర‌ని ఆయ‌న వారిని నిల‌దీశారు. ఈ మేరకు మంగ‌ళ‌వారం స‌చివాలయంలో త‌మ డిమాండ్ల‌తో ప‌లు ఉపాధ్యాయ సంఘాల నేత‌లు త‌న‌ను క‌లిసిన సందర్భంగా మంత్రి బొత్స వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మ‌రో కీల‌క వ్యాఖ్య కూడా చేశారు. ఉపాధ్యాయ సంఘాలు బెదిరింపు ధోర‌ణితో డిమాండ్ల‌ను సాధించుకునేందుకు య‌త్నిస్తున్నాయ‌ని ఆరోపించిన మంత్రి… బెదిరిస్తే ప‌నులు కావ‌ని తేల్చి చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలు అనుకున్న‌వ‌న్నీ కావాలంటే ఎలాగంటూ బొత్స ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగానే ఉపాధ్యాయులు 8 గంట‌లు ఎందుకు ప‌నిచేయ‌ర‌ని మంత్రి ఉపాధ్యాయ సంఘాల‌ను నిల‌దీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker