ఆంధ్రప్రదేశ్
హాసేన రాజేష్ పై రౌడీషీట్ కేసును కొట్టివేసిన ఏపీ హైకోర్టు

పోలీసులు పెట్టిన కేసుల్లో ఎక్కడా పిటిషనర్ శాంతి భద్రతలకు విఘాతం జలిగించలేదన్న న్యాయవాది జడ శ్రావణ్
కుమార్ వాదనలతో హైకోర్టు న్యాయమూర్తి ఏకీభవించారు. 2021లో పెద్దాపురం పోలీస్ స్టేషన్ లో మహాసేన రాజేష్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు కేస్ నమోదుచేసారు. ఈ రౌడీషీట్ ను హైకోర్టులో సవాల్ చేసిన పిటిషనర్ రాజేష్ తరపున హైకోర్ట్ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదిస్తూ మహాసేన రాజేష్ పై రాజకీయ కక్షతో రౌడీషీట్ ఓపెన్ చేశారని ఉద్దేశ్యపూర్వకంగా పోలీసులు నమోదు చేసిన కేసులకు చట్టబద్దత లేదని తన వాదనలు వినిపించారు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానంమహాసేన రాజేష్ పై రౌడీషీట్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.




