ఆంధ్రప్రదేశ్
సబ్ రిజిస్ర్టార్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక
రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ విభాగం సబ్ రిజిస్ర్టార్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలను విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం నిర్వహించారు. అధ్యక్షుడిగా గుంటూరు జిల్లా నల్లపాడు సబ్ రిజిస్ర్టార్ ఎ.గోపాల్, ప్రధాన కార్యదర్శిగా విజయవాడ గుణదల సబ్ రిజిస్ర్టార్ ఎం.కృష్ణప్రసాద్, కోశాధికారిగా విశాఖ జిల్లా ఆనందపురం సబ్ రిజిస్ర్టార్ ఎన్.ఆనంద్‌కుమార్, ఉపాధ్యక్షుడిగా ఎండీ అజీజుల్లా, ఉప కార్యదర్శిగా డీవీ నారాయణ ఎన్నికయ్యారు.