ఆంధ్రప్రదేశ్ముఖ్యాoశాలు
పట్టాలి ఇవ్వడమే కాదు స్థలం ఎక్కడ ఉందో కూడా చూపిస్తాను సీఎం జగన్

నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల పథకం చేపట్టిన జగన్ గృహ నిర్మాణ సంస్థ చేయాల్సిన పనులను విశాఖలో ఎక్కడ ఏది చేయాలి? ఎలా చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఇళ్ల నిర్మాణం పనుల్లో అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు ఆప్షన్ త్రీ కింద ఎంపిక చేసుకున్న ఇల్లు నిర్మాణాలు కూడా వేగంగా జరుగుతున్నాయని అధికారులు వివరించారు సమానంగా కాలనీలో మౌలిక సదుపాయాల పైన కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులు ఆదేశించారు ఎవరికైనా అనుమానాలు ఉంటే వాటిని తీర్చుకోవడానికి ఒక ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ కూడా పెట్టాలని ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు ప్రత్యేకంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పట్టాలు ఇవ్వడమే కాకుండా ఆ స్థలం ఎక్కడ ఉందో ఆ లబ్ధిదారునికి చూపించే బాధ్యత కూడా అధికారులు తీసుకుంటున్నారని తీసుకోవాలని కూడా జగన్ అధికారులకు చెప్పారు



