తెలంగాణముఖ్యాoశాలు

క్షణమైనా పిడుగు పడొచ్చని…..మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణమైనా పిడుగు పడొచ్చని,
కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. బుధవారం ఆయన కార్యకర్తలతో
మాట్లాడుతూ గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయెద్దని కార్యకర్తలకు సూచించారు.
తెలంగాణ సీనియర్‌ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏ క్షణంలో అయినా పిడుగు పడొచ్చు.. ఎన్నికల కోసం కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి అంటూ
ఆసక్తికర వ్యాఖ్యలే చేశారాయన. గతంలో చేసిన తప్పులు పునరావృతం కావొద్దు అంటూ
కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో ఆయన వ్యాఖ్యలపై రకరకాల
చర్చ నడుస్తోంది. పార్టీ మార్పుపై తుమ్మల నిర్ణయం తీసుకోబోతున్నారా? అంటూ ఓవైపు.. మరోవైపు
ఆయన వ్యాఖ్యలు ముందస్తు ఎన్నికలను ఉద్దేశించి చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రిగా
ఉన్నప్పుడు అభివృద్ధిపైనే దృష్టి పెట్టానని గుర్తుచేశారు. కార్యకర్తలను పూర్తిస్థాయిలో
కలవలేకపోయానని తెలిపారు. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరిగానని, ఇప్పుడు మాత్రం
పాలేరుపైనే దృష్టిపెట్టానని చెప్పారు. కార్యకర్తలు ఆశీర్వదిస్తే మిగిలిన పనులను పూర్తి చేస్తానని
తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఏ క్షణమైనా పిడుగు పడొచ్చు అని తుమ్మల చేసిన వ్యాఖ్యలపై
రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా తుమ్మల బీజేపీ (BJP)లో చేరుతారనే ప్రచారం
జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఇలాంటి కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది. రేపోమాపో
బీజేపీలో చేరేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy), టీఆర్‌ఎస్ నేత ఎర్రబెల్లి
ప్రదీప్‌రావు సిద్ధంగా ఉన్నారని సమాచారం. వీరితో పాటు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లోని కీలక నేతలు
కమలం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ
రాజకీయాలు చాలా హీట్ మీద ఉన్నాయి. ఇలాంటి తరుణంలో తుమ్మల కామెంట్స్‌పై పెద్ద చర్చ
నడుస్తోంది. మరోవైపు తెలంగాణలో కేసీఆర్ (KCR) ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ఓ చర్చ నడుస్తోంది.
ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, కార్యకర్తలను సన్నద్ధం చేయడానికే ఆ వ్యాఖ్యలు చేశారని
పరిశీలకులు అంటున్నారు. గత ఎన్నికల్లో తుమ్మల ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఏలాగైనా గెలవాలనే
ఉద్దేశంతో కార్యకర్తలను సిద్ధం చేసేందుకు కీలక వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker