తెలంగాణ

బంజారాహిల్స్‌లో సీఎం కేసీఆర్‌ చేతుల మీదు గా హైదరాబాద్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు కార్యాలయం

ఈ నెల 4న బంజారాహిల్స్‌లో హైదరాబాద్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు కార్యాలయం, ప్రారంభోత్సవం నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు
విధించారు. గురువారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని
హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బంజారాహిల్స్‌లో ప్రభుత్వం నిర్మిస్తున్న
కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ దేశానికే మణిహారంగా నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. నూతనంగా
నిర్మించిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ భవనాన్ని మంగళవారం ఆయ న హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్యేలు
నాగేందర్, గోపీనాథ్, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత, పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దామోదర్‌ గుప్తా,
సీపీ సీవీ ఆనంద్‌తో కలిసి పరిశీలించారు. ఈనెల 4న సీఎం కేసీఆర్‌ చేతుల మీదు గా ప్రారంభం జరుగుతుందని తెలిపారు.
ఎన్టీఆర్‌ భవన్‌ నుంచి అపోలో ఆస్పత్రి, ఫిల్మ్‌నగర్, బంజారాహిల్స్‌ మీదుగా వచ్చే వాహనదారులు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ నుంచి రోడ్డు నంబర్‌–36,45 మీదుగా
మాదాపూర్‌ వైపునకు మళ్లాలి. మాసబ్‌ట్యాంక్‌ నుంచి బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌–12 వైపు వచ్చే వాహనాలు బంజారాహిల్స్‌
రోడ్డు నంబర్‌–1, 10 మీదుగా జహీరానగర్, కేన్సర్‌ ఆస్పత్రి మీదుగా వెళ్లాలి. ఫిల్మ్‌నగర్‌ మీదుగా ఒర్సి ఐస్‌ల్యాండ్‌ మీదుగా
వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్, ఎన్టీఆర్‌ భవన్, సాగర్‌ సొసైటీ, ఎస్‌ఎన్‌టీ, ఎన్‌ఎఫ్‌సీఎల్‌ మీదుగా పంజగుట్ట వైపు
వెళ్లాలి. మాసబ్‌ట్యాంక్‌ మీదుగా రోడ్డు నంబర్‌ 12, జూబ్లీహిల్స్‌ వైపు వచ్చే వాహనదారులు మెహిదీపట్నం,
నానల్‌నగర్, టోలిచౌకి, ఫిల్మ్‌నగర్, జూబ్లిహిల్స్‌కు చేరుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker