దసరా వేడుకల్లో జగ్గారెడ్డి కీలక ప్రకటన……..

జగ్గారెడ్డి తీరుపై ఇప్పుడు కాంగ్రెస్‌లో చర్చ జోరందుకుంది. ఏం చేయబోతున్నారు?.
ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా? అనే కోణంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట మేరకే ఆయన సైలెంట్‌గా ఉంటున్నారని చెబుతున్నారు.
ఢిల్లీలో రాహుల్ గాంధీ తో సమావేశం తర్వాత జగ్గారెడ్డి కంప్లీట్‌గా తన వర్కింగ్ స్టైల్ చేంజ్
చేశారు. పార్టీ విషయాలు మీడియా ముందు మాట్లాడనని అధినేతకు చెప్పిన
నేపథ్యంలో చాలా రోజుల వరకు దాన్ని పాటించారు. కానీ రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం
యశ్వంత్ సిన్హా హైదరాబాద్‌కు వచ్చినప్పుడు వీహెచ్ వెళ్లి కలవడం, పార్టీ గీత దాటిన వారిని
గోడకేసి కొడతామన్న రేవంత్ రెడ్డి కామెంట్స్‌తో జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.దసరా వరకు
జగ్గారెడ్డి ఇలాగే మౌనంగా ఉంటారని, దసరా వేడుకల్లో తన మనసులో మాట
చెబుతారని, కీలక నిర్ణయం ప్రకటిస్తారని లీకులు ఇస్తున్నారు. ఇక లక్ష మందితో సభ పెడతానని
ఆయన గతంలో ప్రకటించారు. ఆ భారీ బహిరంగ సభను డిసెంబర్‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు
చేసుకుంటున్నట్లు సమాచారం. ఆ సభలో జగ్గారెడ్డి తన ఎజెండా వివరించి కీలక ప్రసంగం చేయడానికి
ప్రిపేర్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సభలో జగ్గారెడ్డి.. ఏం ప్రకటన చేస్తారు? ఏదైనా పిడుగు లాంటి
మాట చెబుతారా? అనేది కాంగ్రెస్ పార్టీ సర్కిల్స్‌లో ఉత్కంఠ రేపుతోంది



