అంతా మా ఇష్టం… అంటున్న ప్రభుత్వం
ప్రభుత్వం విఆర్ఓ లపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుంది కొత్త పోస్టుల్లో చేరేందుకు విముఖత
చూపిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఒకవేళ ఎవరైనా
స్వచ్ఛంద పదవి విరమణ తీసుకుంటే ఆమేరకు అనుమతి ఇవ్వాలని కూడా నిర్ణయించింది
వీఆర్వోలకు సంబంధించిన అంశంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఈరోజు జరిగింది ఇతర శాఖలోకి
వీఆర్వోల బదలాయింపు ప్రక్రియ పూర్తయిందని 98 శాతం మంది కొత్త పోస్టుల్లో చేరినట్టు అధికారులు తెలిపారు
మొత్తం 5030 మందికి గాను 5014 మంది తమకు కేటాయించిన శాఖలో చేరినట్టు ప్రభుత్వం పేర్కొంది జీవో 121 ను
సవాల్ చేస్తూ పలువురు హైకోర్టుకు వెళ్లినప్పటికీ 19 మంది విషయంలో మాత్రం యధా స్థితిలో కొనసాగించాలని హైకోర్టు
ఆదేశాలను ఇచ్చింది అని అధికారులు చెప్పారు అయితే దాదాపు 15 మంది తమకు కేటాయించిన శాఖలో చేరినట్లు
సమాచారం వీఆర్వో రెవెన్యూ శాఖలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించే ప్రసక్తే లేదని కేటాయించిన శాఖలో తప్పనిసరిగా
చేయాల్సిందేనని ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వం స్పష్టం చేసింది లేకపోతే వారిపై చర్యలు తీసుకునేందుకు అన్ని
రకాలుగా సిద్ధమవుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంటుంది




