తెలంగాణ
రాయదుర్గంలో రోడ్డుప్రమాదం.. ట్రాన్స్జెండర్ మృతి
రాయదుర్గం పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ట్రాన్స్ జెండర్ మృతి చెందారు.
మిత్రుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ట్రాన్స్ జెండర్ సుధాకర్ అలియాస్ మౌనిక(24) ఖాజాగుడా వైపు
వెళ్తున్నారు. ESCI గేటు వద్ద బైక్ అదుపు తప్పడంతో మౌనిక కింద పడ్డారు. తీవ్ర గాయాలపాలైన
మౌనికను వెంటనే స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు.అయితే అప్పటికే మృతి చెందినట్లు
వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు మౌనిక మృతదేహాన్ని పోస్ట్ మార్టం
నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. ట్రాన్స్జెండర్ మౌనిక స్వస్థలం వైజాగ్
అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.



