తెలంగాణ
స్వాతంత్య్ర దినోత్సవాన్ని బ్లాక్ డేగా పాటించాలి: మావోయిస్టు పార్టీ పిలుపు

స్వాతంత్య్ర దినోత్సవాన్ని బ్లాక్ డేగా నిర్వహించాలని మావోయిస్టు పార్టీ నిర్మల్ జిల్లా మంగ్లీ ఇంద్రవెల్లి ఏరియా కమిటీ కార్యదర్శి వర్గేష్ కోరారు. ఈ మేరకు శనివారం ఆయన పేరిట ఒక ప్రకటన విడుదలైంది. దే శాన్ని, రాష్ర్టాన్ని దోచుకునే వారు ఉన్నంతకాలం దేశానికి స్వాతంత్య్రం రానట్టేనని పేర్కొన్నారు. ఆజాదీకి అమృత్ మహోత్సవ్ పేరిట హిందుత్వ శక్తులు, మతవాద శక్తులు దేశాన్ని తాకట్టుపెడుతున్నారన్నారు.



