తెలంగాణముఖ్యాoశాలు

రాజగోపాల్‌రెడ్డిపై వేటు కు రంగం సిద్ధం చేసిన……… కాంగ్రెస్‌ అధిష్ఠానం

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించేందుకు కాంగ్రెస్‌
 అధిష్ఠానం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో మరింత నష్టం
జరగకముందే ఆయనపై వేటు వేస్తే పార్టీ శ్రేణులకు బలమైన సంకేతాలు
 పంపినట్టుగా ఉంటుందని యోచిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో
 మునుగోడులో పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు కసరత్తు ప్రారంభించింది.
 స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని కాదని కోమటిరెడ్డికి టికెట్‌ ఇచ్చి గెలిపించుకుంటే,
 సొంత అవసరాల కోసం పార్టీ ఫిరాయించేందుకు సిద్ధమైన అంశాన్ని ప్రజల్లోకి
తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు మునుగోడులో విస్తృతంగా ప్రచార
కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. విచారణ పేరిట
 సోనియా, రాహుల్‌ను ఈడీ వేధిస్తోందంటూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు
 పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన వేళ..ఈ విషయంలో చట్టం తన పని తాను
 చేసుకుపోతుందంటూ రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించడాన్ని అధిష్ఠానం
 తీవ్రంగా పరిగణించినట్లు తెలిసింది. దివంగత నేత పాల్వాయి గోవర్థన్‌రెడ్డి
 హయాం నుంచి మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన
 పునాదులు ఉన్నాయి. ఆపరేషన్‌ ఆకర్ష్‌ పేరిట టీఆర్‌ఎస్‌ ప్రలోభాలకు గురి
చేసినా కాంగ్రెస్‌ కేడర్‌ చెక్కు చెదరలేదు. సుదీర్ఘకాలం పాటు మునుగోడు నుంచి
 ప్రాతినిథ్యం వహించిన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మరణించాక, రాజకీయ వారసురాలిగా
ఆయన కూతురు శ్రవంతి పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. అయితే, 2018
 ఎన్నికల్లో అనూహ్యంగా రాజగోపాల్‌రెడ్డికి టికెట్‌ దక్కింది. తాజాగా రాజగోపాల్‌రెడ్డి
 బీజేపీలో చేరనున్న నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు అలర్ట్‌ అయ్యారు. పార్టీ రాష్ట్ర
 వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌.. జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో
 ఇప్పటికే సంప్రదింపులు జరిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker