తెలంగాణ
పేదోడి సంక్షేమంపై విషం చిమ్ముతున్నారా……టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

పేదోడి సంక్షేమంపై విషం చిమ్ముతున్నార......టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రధాని మోదీ విషం చిమ్ముతున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.స్వాతంత్య్ర దినోత్సవం రోజునజాతినుద్దేశించి చేసే ప్రసంగంలో భాగంగా సంక్షేమ పథకాలపై తన వైఖరేంటో ప్రధాని మోదీ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఏది ఉచితమో, ఏది అనుచితమో దేశ ప్రజలకు వెల్లడించాలని కోరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉచిత పథకాల రద్దుపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాక, సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తామని ప్రకటించి ఎన్నికలకు వెళ్లగలరా అని బీజేపీకి సవాల్ విసిరారు. ఉచిత పథకాలపై ప్రధాని మోదీ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రధాని మోదీ, కేంద్రం తీరును విమర్శిస్తూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉచిత సంక్షేమ పథకాలను రద్దు చేసేందుకు పార్లమెంట్‌లో చట్టం కానీ, రాజ్యాంగ సవరణ కానీ చేస్తారా ? అని బీజేపీని ప్రశ్నించారు. ఎనిమిదేళ్ల పాలనలో ప్రజాసంక్షేమాన్ని గాలికి వదేలిసిన బీజేపీ ప్రభుత్వం సామాన్యుని బతుకుని భారంగా మార్చిందని విమర్శించారు.మోదీకి ముందున్న 14 మంది ప్రధానులంతా కలిసి రూ.56 లక్షల కోట్ల అప్పు చేేస్త, ఆయనొక్కరే సుమారు రూ.80 లక్షల కోట్లకు పైగా చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ అప్పులకు వడ్డీ కట్టేందుకు దేశ వార్షిక రాబడిలో 37ు ఖర్చు అవుతున్నదని కాగ్ హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాక, ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం కేంద్రం జీడీపీలో 40 శాతానికి మించి అప్పులు చేయకూడదని, కానీ మోదీ సర్కారు ఇప్పటికే 54 శాతం అప్పులు చేసిందన్నారు. పరిస్థితి ఇదే రకంగా కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని కాగ్ హెచ్చరించడం నిజం కాదా అని అడిగారు. సీనియర్ సిటిజన్లకు రైలు టికెట్లలో రాయితీ,రైతు రుణమాఫీ,బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఒక్క రూపాయికే కిలో బియ్యం, గురుకుల స్కూళ్లు పెట్టి పేద బిడ్డలకు ఉచిత వసతులిచ్చిoది,నేతన్నకు చేయూత, నేతన్నకు బీమా, బతుకమ్మ చీరలు,కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్, దళితబంధు అవసరం లేదంటారా,వంటగ్యాస్ సిలిండర్‌పై ఇస్తున్న సబ్సిడీ ఎత్తేయాలనే దుర్మార్గమైన ఆలోచన సంక్షేమ పథకాలపై ప్రధాని మోదీ విషం చిమ్ముతున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.



