తెలంగాణముఖ్యాoశాలు
సాహితీ పై చర్యలకు ప్రభుత్వం ముందుకు రాదా?

బాధితుల కన్నీళ్లు చూసైనా ప్రభుత్వానికి జాలి కలగడం లేదా 22 రోజులైంది...... ప్రభుత్వానికి తెలియద అంటారా సాహితీ ఇన్ఫ్రా పేరుతో ఫ్రీ లాంచ్ అని చెప్పి పక్కాగా 2019లో ప్లాన్ చేసుకొని ,కొంతమంది ఉద్యోగులను పెట్టుకుని వారి ద్వారా దాదాపు 1200 మంది కి పైగా ప్రజలను కస్టమర్లుగా చేర్చుకొని, మూడు సంవత్సరాలు గడువు పెట్టి, దాదాపు 1500 కోట్లు వసూలు చేసుకుని మూడు సంవత్సరాల తర్వాత చేతులెత్తేశారు. మాకు అన్యాయం జరిగింది మాకు న్యాయం చేయండి అని చెప్పి రోడ్డు మీద పడి విలపిస్తున్న, లక్ష్మీనారాయణకు జాలి కలగడం లేదా గోల చేసి కొట్లాడుకొని వారే వెళ్ళిపోతారు అని చూస్తున్నాడా, నిజం అతనికే తెలియాలి, వాస్తవానికి ఒక వెంచర్ వేయాలన్న, ఒక గ్రామ పరిధిలో భూమి కొని ,అపార్ట్మెంట్లు కట్టాలన్న, హెచ్ఎండిఏ పర్మిషన్ కావాలి ,సాహితి వారికి భూమి సరైన పద్ధతిలో లేదు. ఆ భూమిని సరి చేసుకోవడానికి సంగారెడ్డి కలెక్టరేట్లో ఒక వ్యక్తిని నమ్మి ,మూడు సంవత్సరాలు గడువు పేడితే, ఆ వ్యక్తి 2019 నుంచి ఇప్పటివరకు ఆ ల్యాండ్ పై ఎటువంటి పనులు చయ్లేదా, పటాన్చెరు ఎమ్మెల్యే .మంత్రి హరీష్ రావు, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్, అమీన్పూర్ తాసిల్దార్, సంగారెడ్డి కలెక్టర్ ,సంగారెడ్డి ఆర్ డి ఓ, మరియు ఇతర అధికారులు ప్రసన్నం చేసుకోవడానికి డబ్బు ఖర్చు చేసి నష్టపోయాడా, ఏమైంది .దశలవారీగా కస్టమర్ల నుండి డబ్బులు కట్టించుకుని, సగం పైగా వైట్ మనీ, సగం బ్లాక్ మనీ గా ఇవ్వాలని కోరిన కంపెనీ, తీసుకున్న బ్లాక్ మనీని ఏం చేశారు. వైట్ మనీని ఏం చేశారు. ఇన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. మరి ఆ డబ్బు ఎక్కడికి పోయింది. లక్ష్మణ్ నారాయణను ప్రశ్నిస్తున్న ప్రజలు, ఆయన ఏమి సమాదానo చేబుతాడు .ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు పోలీసులకు ఇచ్చాను కదా నన్నేం చేస్తారులే అని ధీమాగా ఉన్నాడా .జులై నెల 26వ తేదీ నుంచి ఇప్పటివరకు 22 రోజులైంది ఏమాత్రం సరైన సమాధానం చెప్పకుండా, వీడియో కాల్స్ ద్వారా, మెయిల్స్ ద్వారా, మెసేజ్ ల ద్వారా, బాధితులకు కొంతమందికి మాత్రమే, మాట్లాడుతూ టైం పాస్ చేస్తున్నాడు. ప్రభుత్వం 22 రోజుల పోరాటాన్ని పత్రికల్లోనూ టీవీల్లోనూ చూస్తూ కూడా ఏమాత్రం స్పందన లేకుండా ఉండటం వెనుక ఆంతర్యం ఏంటి. ప్రభుత్వం సాహితీ సొమ్మును తీసుకుందని అనుకోవాలా, మరి ఏమనుకోవాలి, బాధితులు రోడ్లమీద పడి ఏడుస్తుంటే, హైదరాబాదు లాంటి పెద్ద సిటీలో జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే, అది ప్రభుత్వానికి తెలియద అంటారా, ఏమనుకోవాలి లక్ష్మీనారాయణకు మద్దతు ప్రభుత్వం తెలుపుతుందా, లేక ప్రజలకు మేలు చేస్తుందా, ఏం చేస్తుంది అనేది వేచి చూడాల్సిందే.




