ఆంధ్రప్రదేశ్ముఖ్యాoశాలు

ప్రభుత్వంలో విలీనంతో ఆశించిన ప్రయోజనాలు రావడం లేదు…. ఆర్టీసీ ఐకాస

ఆర్టీసీ ఐకాసలోని 14 సంఘాల నేతలు వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఎన్‌ఎంయూ, ఈయూ సహా వివిధ సంఘాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పీఆర్సీ అమలు సహా ఇబ్బందులు తీర్చాలని ఐక్యవేదిక ఈ సందర్భంగా డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సీఎం జగన్‌కు వినతిపత్రాలు పంపాలని ఆర్టీసీ ఉద్యోగులు నిర్ణయించారు. ఉద్యోగుల సంతకాల సేకరణ అనంతరం… ఈ నెల 21 నుంచి 28 వరకు సీఎంకు వరుసగా వినతిపత్రాలు పంపనున్నారు. 26 జిల్లాల కలెక్టర్ల ద్వారా ఈ వినతిపత్రాలు పంపిస్తారు.

ఈ సందర్భంగా ఐకాస ప్రతినిధులు మాట్లాడుతూ ‘‘ఆర్టీసీ ఎండీ, ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వంలో విలీనంతో ఆశించిన ప్రయోజనాలు రావడం లేదు. ఎస్‌ఆర్‌బీఎస్‌, ఎస్‌బీటీ వంటి సంక్షేమ పథకాలు నిలిపేశారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు లేకుండా నిర్ణయాలు అమలు చేసేస్తున్నారు’’అని ఆక్షేపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker