తెలంగాణముఖ్యాoశాలు
వికారాబాద్‌లో .. కలెక్టరేట్ నూతన భవనం ప్రారంభోత్సవం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డు మార్గం ద్వారా వికారాబాద్ పట్టణానికి చేరుకున్నారు.అక్కడ నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ నూతన భవనాన్ని ప్రారంభించారు. వాస్తవానికి కలెక్టరేట్ భవనం ఏడాది క్రితమే పూర్తయ్యింది. సీఎంకు సమయం కుదరకపోవడంతో ప్రారంభోత్సవం కోసం ఇన్నాళ్లు వేచి చూడాల్సి వచ్చింది. తాజాగా రూ.42 కోట్ల వ్యయంతో 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కలెక్టరేట్ భవనం అందుబాటులోకి వచ్చింది. దీంతో జిల్లా కేంద్రంలో శాఖలన్నీ ఒకే గూటికి చేరుకున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న కలెక్టరేట్ భవనంలో కేవలం డజన్ శాఖలు మాత్రమే ఉండగా కీలక శాఖలన్నీ బయటే కొనసాగుతున్నాయి..ముఖ్యమంత్రి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తు రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలుపెరిగాయి . తెలంగాణ ఏర్పడకపోతే వికారాబాద్ జిల్లా అయ్యేదా? ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్ జిల్లాగా చేశాం. కర్ణాటక, ఏపీలో కంటే భూముల ధరలు తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో ఒక్క ఎకరా అమ్మితే ఏపీలో మూడు ఎకరాలు కొనవచ్చన్నారు. సరిహద్దు పంచుకుంటున్న కర్ణాటక వాసులు తెలంగాణలో కలవాలని కోరుకుంటున్నారు. తమ రాష్ట్రంలో కూడా తెలంగాణాలో లాగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని కర్ణాటక వాసులు కోరుతున్నారు. కొత్తగా 10 లక్షల పింఛన్లు ఇవ్వడం ప్రారంభించాం. రైతు బీమా కింద రూ. 5 లక్షలు ఇస్తున్నాం. ప్రాజెక్టులు ఉన్న చోట పన్ను లేకుండా నీళ్లు ఇస్తున్నాం. రైతు బంధు, రైతు బీమా పక్కగా అమలవుతున్నాయి. 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.వచ్చిన తెలంగాణను గుంటనక్కల పాలు కాకుండా చూడాలి. సంక్షేమ పథకాలను ఉచితాలని కేంద్రం అంటోంది. వికారాబాద్‌కు మెడికల్, డిగ్రీ కళాశాల మంజూరు చేశాం. తాగునీరు, సాగునీరు, కరెంటు సమస్యలు లేవు. దేశంలో పంట పెట్టుబడి తీసుకుంటున్నది తెలంగాణ రైతు మాత్రమేనన్నారు.