
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజాసంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని సినీ నటుడు సుమన్ హర్షం వ్యక్తం చేసారు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి కోదాడకు వెళ్తూ మార్గంమధ్యలో నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలోని వివేరా హోటల్‌లో విలేకరుల తో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనంటే ఎనలేని అభిమానమని చెప్పారు. తెలంగాణకు కేసీఆర్ సేవలు చాలా అవసరమన్నారు. రాజకీయాల్లోకి వస్తారా? అని ప్రశ్నిస్తే, నేను రావడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.
. ప్రస్తుతం నాలుగు కొత్త చిత్రాల్లో నటిస్తున్నానని, మరి కొన్ని కథా చర్చలలో ఉన్నాయని తెలిపారు. ను




