వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి….ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నిగుల వెంకటప్రసాద్

ఈరోజు ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ పిలుపుమేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నిగుల వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం జరిగినది మరియు కలెక్టర్ గారికి మా యొక్క ప్రధానమైన డిమాండ్ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి జీవో ఎంఎస్ 98 ప్రకారం వృత్తి లేని మాకు మత్స్య సహకార సంఘంలో సభ్యత్వం కల్పించాలి వాల్మీకి ఫెడరేషన్ ద్వారా అర్హులైన వారికి రుణాలు ఇప్పించాలి ఒకవేళ మా డిమాండ్లు నెరవేర్చకుంటే రానున్న రోజుల్లో మంత్రిగారి కార్యాలయాలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు ముట్టడించడం జరుగుతుందని డిమాండ్ చేసినారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నాయకులు భోగి కృష్ణమూర్తి మండల సాంబయ్య కుర్ల మోహన్ జిల్లా కమిటీ సభ్యులు ముచ్చు రాజకుమార్ పట్ల శంకర్ భోగి లింగయ్య కంచన పెళ్లి వెంకటయ్య నిగుల సతీష్ వివిధ గ్రామాల నుంచి వచ్చిన ముఖ్య నాయకులు కుర్ల కొమురెల్లి ముసుకే సంతోష్ పట్ల సంపత్ ఉజైతుల శ్రీను చంద్రబోయిన రవి నిగ్గుల సతీష్ ముచ్చు అజయ్ పేర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు



