తెలంగాణముఖ్యాoశాలు

హైదరాబాదులో ఆసుపత్రుల దురాగతాలు….


: తెలంగాణలో వైద్యానికి చీడ పట్టింది పేరు మోసిన ఆస్పత్రుల్లో ధన దాహం ఎక్కువైంది. వైద్యం చేసేటప్పుడు పేషెంట్ బంధువులు, ఎవరు ఉండరాదని చెప్పి, వారి ఇష్టం వచ్చిన విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎంత ఖర్చవుతుంది అనే ప్రశ్నలు, సమాధానాలు ఏమీ ఉండవు,
 ఏ ట్రీట్మెంట్ నచ్చితే ఆ ట్రీట్మెంట్ చేయాల్సిందే దానికి ఎంత ఖర్చైనా పేషెంట్ పెట్టుకోవాల్సిందే అలాగని పేషెంట్ బతుకుతాడా బతకడ, ఎందుకు బతకుతాడు .. ట్రీట్మెంట్ ఏం చేశారు అనేది అడిగితే వారి దగ్గర నుండి సమాధానం ఉండదు .ఇలాంటి సంఘటనలు హైదరాబాదులో రెండు జరిగాయి. ఒకటి తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి గ్రామానికి చెందిన సందీప్ అనే యువకుడు పురుగులు ముందు సేవించి ఆగస్టు 5వ తేదీన కేర్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు ఈనెల 20వ తారీఖున సదరు వ్యక్తి మరణించాడని అతని భార్యకు తండ్రికి చెప్పారు. ఆ పిమ్మట శవాన్ని ఇవ్వమంటే ఇంకా 80000 కట్టాలి కడితేనే ఇస్తాం అని, సమాధానం చెప్పారు  హాస్పటల్ సిబ్బందికి అవుతుందని మృతుని బంధువులు 40 వేలు తీసుకొచ్చి కట్టి విడిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ సంఘటనకు సంబంధించి ఆసుపత్రికి వచ్చిన ఎస్ఐ కృష్ణ  చనిపోయిన వారి బంధువుల దగ్గరికి పోయి మీరు కంప్లైంట్ ఇవ్వండి వారి మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పారు .ఎంతో కొంత కట్టి తీసుకొని వెళ్లడం మంచిది కానీ గొడవ చేయడం అంత మంచిది కాదని సలహా ఇచ్చారు, మృతుని బంధువులతో కృష్ణ అనే ఎస్ఐ చేసిన సంభాషణ ఒకింత మృతుని బంధువులకు సపోర్టు గాని నిలిచింది. దాంతో 40 వేల తోనే ఆసుపత్రి సిబ్బంది సరిపెట్టుకుని వాడిని మృతుని బంధువులు కి ఇచ్చారు దీనికోసం సాయంత్రం 8:30 కు చనిపోయిన వ్యక్తి శవాన్ని తెల్లవారిందా పెట్టుకొని డబ్బులు కట్టాకే పంపించారు ఇదేనా వైద్యం ఇదేనా నీతి చదువు లేని వాళ్ళని చూసుకొని హాస్పిటల్ వారు విచ్చలవిడి మాట్లాడుతున్నారు వైద్య ఆరోగ్యశాఖ మాత్రం చూసి చూడనట్టు వదిలేస్తుంది రెండు అంశం వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్ లో పనిచేసే ఒక వ్యక్తి వెన్నుపూస ట్రీట్మెంట్ కోసం విరించి హాస్పిటల్ జూబ్లీహిల్స్ లో చేరారు జూబ్లీహిల్స్ హాస్పిటల్ సిబ్బంది డాక్టర్లు ఎంతో గౌరవంగా రిసీవ్ చేసుకుని అతనికి వైద్య పరీక్షలు చేయడానికి నిర్ణయించారు నీకు కావలసిన డబ్బులు మీ బెనిఫిట్స్ నుండి బిఎస్ఎన్ఎల్ ఇచ్చే సదుపాయాల నుంచి సరిపోతాయని చెప్పి వైద్యం ప్రారంభించారు వైద్యం అయిపోయాక డబ్బులు సరిపోలేదు మరో 20% డబ్బులు కట్టాలి అని హాస్పిటల్ సిబ్బంది పేషెంట్ పై ఒత్తిడి తెచ్చారు ఒత్తిడికి లోనైన పేషంట్ గుండె నొప్పితో ఆసుపత్రిలోనే చనిపోయారు అయినా గాని ఆసుపత్రి వారు వదలకుండా వారికి కావాల్సింది తీసుకొని పంపించారని తెలుస్తోంది ఈ విషయంపై మృతుని కుమారుడు విరించి ఆసుపత్రి పైన చర్యలు తీసుకోవాల్సిందిగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వెళ్లి తన ఫిర్యాదును ఇచ్చారు ఫిర్యాదులు తీసుకున్న పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పంజాగుట్ట ఎస్సై మహేష్ ను ప్రశ్నించగా విరించి హాస్పటల్ వారు  కేవలం పత్రిలో జరిగిన సంఘటనపై ఆసుపత్రి సిబ్బందిపై మృతుని బంధువులు గొడవ చేసి దాడి చేయబోయారని అటువంటి విషయంపై పూర్తి దర్యాప్తు చేయాల్సిందిగా విరించి హాస్పిటల్ వారు ఎస్సై కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది దీనిపై ఎస్సై మహేష్ తన ఎంక్వయిరీ  కొనసాగిస్తున్నానని చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker