
యంగ్ క్రికెటర్ కె.ఎల్.రాహుల్ తో బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్ ఎఫైర్ గురించి చాలాకాలంగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అయితే తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని నిధి అగర్వాల్ తెలిపింది. ఇక టాలీవుడ్ లో తన డెబ్యూ గురించి మాట్లాడుతూ .. ఇరువురు అక్కినేని హీరోల సరసన నటించడం ఆనందాన్నిచ్చిందని, మిస్టర్ మజ్ను విజయం తనలో ఉత్సాహం నింపిందని తెలిపింది. తదుపరి ఈ భామ స్పీడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వ ంలో ఇస్మార్ట్ శంకర్ లో అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే. రామ్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. తదుపరి నిధి అగర్వాల్ బాలీవుడ్ లో నూ పలు చిత్రాల్లో నటించనుందిట.



