మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ని కలిసిన జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ

హైదరాబాద్: ది జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నాన్ అలాటీ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఈ రోజు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారిని కలిసి ఇప్పటి వరకు ఇండ్ల స్థలాలు పొందని హౌసింగ్ సొసైటీ సభ్యులందరికీ ఇండ్ల స్థలాలు వచ్చేలా చూడాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అల్లం నారాయణ గారు మాట్లాడుతూ అర్హులైన జెసిహెచ్ఎస్ సభ్యులందరికీ ఇండ్ల స్థలాలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు తో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలకు క్లియరెన్స్ వచ్చిందని చెప్పారు. జర్నలిస్టులను ప్రత్యేక కేటగిరీ గా సుప్రీంకోర్టు పేర్కొనడం సంతోషదాయకమైన విషయం అన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి దృష్టికి తెచ్చి అర్హులైన జర్నలిస్టు లందరికీ న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. అర్హులైన జర్నలిస్టులకు అన్యాయం జరగకుండా ముఖ్యమంత్రి గారు చూస్తారని, జర్నలిస్టు మిత్రులందరూ ఆయనపై నమ్మకం ఉంచాలని కోరారు. త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి ఇళ్ల స్థలాల విషయమై మాట్లాడుతామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాదులో పనిచేస్తున్న జర్నలిస్టులకు అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి గారు సుముఖంగా ఉన్నారని అల్లం నారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెసిహెచ్ఎస్ (JCHSL) నాన్ అలాటీ స్టీరింగ్ కమిటీ సభ్యులు బి.గోపరాజు, భీమగాని మహేశ్వర్ గౌడ్, ఎన్.సుందర్, ఎం.రవీంద్రబాబు, జె.రామకృష్ణ, సత్యమూర్తి, ఎన్.భూపాల్ రెడ్డి, పర్వీన్, వై.సునిత తదితరులు పాల్గొన్నారు.



