ఘనంగా వరలక్ష్మీ వ్రతమహూత్సవం…. హాజరైన ప్రముఖులు

రామచంద్రాపురం, ఆగస్టు 19 : పటాన్చెరు నియోజకవర్గం, రామచంద్రాపురం మండలం, తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్ నగర్ గ్రామంలో తెల్లాపూర్ మునిసిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు నివాసంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతమహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా శ్యామ్ రావు సతీమణి పర్సపద్మ తో కలిసి వరలక్ష్మి అమ్మవారి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గాలి అనిల్ కుమార్, రామచంద్రాపురం డివిజన్ కార్పొరేటర్ పుష్ప నగేష్, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, అమీన్ పూర్ మునిసిపాలిటీ కౌన్సిలర్ కాట సుధా శ్రీనివాస్ గౌడ్, పటాన్ చెరు మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, రామచంద్రాపురం సి.ఐ సంజయ్ కుమార్, బండల గూడ మాజీ సర్పంచ్ జయమ్మ, కౌన్సిలర్లు పావని, శ్రీకాంత్ రెడ్డి, నాగరాజు, శ్రీశైలం, వచ్చిరాము నాయక్, మహిళా నాయకురాలు రాణి,111, 112, 113 డివిజన్ల మహిళా అధ్యక్షులు ఉస్మాన్ నగర్ మాజీ సర్పంచ్ కల్పన శ్రీనివాస్, మాజీ ఎంపిపి ఉపాధ్యక్షులు సి. ప్రభాకర్ రెడ్డి, అరుణ్ గౌడ్, యోగా గురువు లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఉపసర్పంచులు, స్నేహితులు జమీందారు సత్యనారాయణ దంపతులు, వీర రాఘవులు దంపతులు, మన్నె శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి, విష్ణు,శివ, రవిందర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, కంజర్ల మల్లేష్, డోకూరి భూపాల్ రెడ్డి, రామన్న గూడెం మల్లేష్, కుటుంబ సభ్యులు, అభిమానులు, మిత్రులు, భారీ ఎత్తున మహిళలు హాజరై వరలక్ష్మీ వ్రతం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భోజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరలక్ష్మీ వ్రతం మహోత్సవానికి హాజరైన ప్రతి ఒక్కరికి పర్స శ్యామ్ రావు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.




