తెలంగాణముఖ్యాoశాలు

చట్టం ఎవరికి చుట్టం కాదు… అందరూ సమానులే : హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రంగనాథ్

*ప్రజలతో కలిసి పని చేస్తున్నాం
*ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నమే మా డ్యూటీ …….
*హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రంగనాథ్

చట్టం ఎన్ని ఆంక్షలు పెట్టినా అన్ని ప్రజల యొక్క ప్రాణాలు కాపాడడానికేనని చట్టం ఎవరికి చుట్టంగా పనిచేయదని ప్రజల కోసమే మా ప్రాణాలు పణంగా పెట్టి డ్యూటీలు చేస్తున్నామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఎ వి రంగనాథ్ ఐ పి స్ అన్నారు. ఆయనను కలిసిన సిటీ క్రైమ్ ప్రతీనిది తో ఆయన మాట్లాడారు. ట్రాఫిక్ నిబంధనలు అన్ని సక్రమంగా పాటించే ఏ వ్యక్తికి నష్టం జరగదని ఎప్పుడైనా ఏమరపాటుతోను తొందరపాటుతోనో చిన్న చిన్న తప్పులు జరిగితే వాటిని కూడా ట్రాఫిక్ పోలీసులు వదిలేస్తున్నారని, ప్రజల యొక్క ప్రాణాలకు ఎటువంటి హాని కలగకుండా, ఎండనక వానక దుమ్ము దూళి పడుతున్న ట్రాఫిక్ పోలీసులు ఏమాత్రం ఏమరపాటు లేకుండా ప్రజల కోసం వారి క్షేమం కోసం పెట్టిన నిబంధనలను సక్రమంగా ఉండే విధంగా చూస్తున్నారని ఎక్కడ కూడా పొరపాటు జరగటం లేదని ఆయన చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు , చలానాలు కావాలనే వేస్తున్నారని చాలామంది అపోహలు పడుతున్నారు, తప్పు చేస్తే తప్ప ఫోటో తీసే అవసరం ట్రాఫిక్ పోలీసులకు లేదని, తప్పు జరగనిదే ఫోటో తీసినందువల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని, తన ప్రయోజనం గురించి కాకుండా ఒక్కసారి డబ్బులు పోతున్నాయి అని తెలుసుకున్న ఏ వ్యక్తి అయినా మారతాడని తప్పకుండా, ప్రతి ఒక్కరూ పోలీసులు పెట్టే నియమ నిబంధనలు పాటించడం వల్ల, ఎటువంటి ఇబ్బందులు జరగకుoడా, ప్రభుత్వం పోలీసులు ఇరువురు ప్రజల ప్రాణాలను వారి ఆస్తులను కాపాడుతూ పోలీసు డ్యూటీ చేస్తున్నారు ఆయన చెప్పుకొచ్చారు.ట్రాఫిక్ పోలీస్ డ్యూటీ చేసే సమయంలో తీసే ఫోటో గాని కట్టమని అడిగే చలానాలు గాని జిపిఎస్ సిస్టం ద్వారా కంట్రోల్ రూమ్ కి అనుసంధానమై ఉంటుంది ఎవరు ఏ వ్యక్తిని ఆపినా ఫోటో తీసిన అక్కడ్నుంచి కంట్రోల్ రూమ్ కి మెసేజ్ రూపంలో సమాచారం వస్తుంది ఆపిన వెంటనే చలానాలు కట్టకపోతే ఎందుచేత కట్టలేదు అనేది కూడా కంట్రోల్ రూమ్ కి జిపిఎస్ సిస్టం ద్వారా సమాచారం వస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ జీతాలు వస్తాయి అట్లానే పోలీసులకి జీతాలు వస్తాయి మరి వేరే శాఖ ఉద్యోగులు ఐదు గంటలకు వెళ్లి తమ పని తాను చేసుకుంటారు పోలీసులు అలా కాకుండా 24 గంటలు కాపలా కాస్తూ అర్థరాత్రి నిశి రాత్రి తెల్లవారుజామున పగలు అని తేడా లేకుండా ప్రజల యొక్క ప్రాణాలను వారి భద్రతను ధ్యేయంగానే పెట్టుకొని డ్యూటీ చేస్తాడు, తాగి బండి నడిపితే లేదా కారు నడిపితే ప్రమాదం జరిగితే తాగినవాడు తాగనివాడు ఇద్దరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది కదా, అలాంటప్పుడు వారిచేత కొన్ని సమయాల్లో వ్యతిరేకత వచ్చిన ఇబ్బందులు తలెత్తిన అవన్నీ లెక్కల్లో పెట్టుకోకుండా పోలీసులు వారి డ్యూటీ వారు చేస్తారు.కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఎవ్వరిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు అతి తొందరలో ట్రాఫిక్ పోలీస్ కార్యాలయాలు మంచిగా తీర్చిదిద్దామని హోంగార్డుల యొక్క పనితీరు ఎంతో బాగుందని వారు చెప్పుకొచ్చారు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ఉన్నవారితోనే మెరుగైన సేవలు అందిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. , వాహనాలు సీజ్ చేసిన తర్వాత ఆరు నెలల పాటు డబ్బులు చెల్లించి తీసుకెళ్లే అవకాశాన్ని ప్రజలకు ఇచ్చామని అలాగే నూతన వాహనాలు కొన్నవారు వారి రిజిస్ట్రేషన్ సమయాన్ని ఆరు నెలలకు పెంచామని,ఇచ్చిన సమయం దాటితే చార్జిషీట్ వేస్తామని ఆయన స్పష్టం చేశారు ఇదే సమయంలో టి ఆర్ నెంబర్ తో బ్లాక్ ఫిల్మ్ తో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అయినా వెనుకడబోమని ఆయన తెలిపారు. ఒక్కసారి వాహనానికి చలానా పడితే ఆ చలానా చెల్లించడానికి ఆరు నెలల వరకు గడువుంటుందని ఈలోపు మెసేజ్ ద్వారా సమాచారం అందించి, వారిని ముందుగానే జాగ్రత్త పడమని చెబుతామని, అలా కాని ఎడల ఆరు నెలల దాటితే ఆ వాహనాన్ని సీజ్ చేయాల్సి వస్తుందని చేసిన తర్వాత మరో ఆరు నెలల్లోపు వాహనం తీసుకెళ్లడానికి మూడు నోటీసులు ఇవ్వడం జరుగుతుందని ఆ తర్వాత సంబంధిత వ్యక్తులు ముందుకు రాకపోతే దానిని వేలం వేసి ప్రభుత్వానికి డబ్బులు పంపిస్తామని ఆయన చెప్పారు. సిటీలో వాహనాల నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్ హారన్స్ , ఉపయోగించే వారి మీద చర్యలు తీసుకుంటామని త్వరలో సిటీలో వాహనాల స్పీడ్ కు సంబంధించి కంట్రోల్ చేయడానికి ఆధునిక టెక్నాలజీ ని వాడతామని ఆయన చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker