తెలంగాణ
సంగారెడ్డి జిల్లాలో యదేచ్చగా ప్రభుత్వ భూముల ఆక్రమణలు
సంగారెడ్డి జిల్లాలో ఇస్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో సర్వేనెంబర్ 496 లో మొత్తం 175 ఎకరాలు పైనే ఉంది ఈ భూమి మొత్తం గవర్నమెంట్ కిందే లెక్క పెట్టుకోవాలి ఈ భూమి మీద 80 మందికి పైగా లబ్ధిదారుల పేర్లు ధరణిలో నమోదు కాబట్టే ఈ పేర్లు ధరణిలో ప్రొహిబిటెడ్ క్రింద ఉన్నాయి కేవలం బై నెంబర్లు లేకుండా 496 సర్వేనెంబర్ ఒక్కటే 91 ఎకరాల పైన ఉంది ఈ భూమి ప్రస్తుతం పంచాయితీ వార్డు మెంబర్లు సర్పంచులు ఎంపిటిసిలు వీళ్ళ సమక్షంలో అక్కడి వారి వారి అనుచరులకి తాలూకా పొందగజాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి పంచాయతీ పరిమిషన్ ఇచ్చింది ఈ పంచాయతీ పరిమిషన్ ఇచ్చింది అనడానికి మన దగ్గర ఆధారాలు లేనప్పటికీ కరెంటు సంబంధించిన ఒక అడుగు ముందుకేసి వారికి మీటర్లు కూడా ఇచ్చారు అదేమని అడిగితే గ్రామపంచాయతీ వారు ఆ ఇళ్ళకి డోర్ నెంబర్ కేటాయించారు కాబట్టి మేము ఇవ్వాల్సి వచ్చింది అని ఏఈ చెబుతున్నారు పటాన్చెరువు తాసిల్దారిని ప్రశ్నించగా ఎన్ని ఇల్లు కట్టిన కూలగొడుతూనే ఉన్నాం. రాత్రికి రాత్రి కట్టేసి ప్రజాప్రతినిధుల చేత పైరవీలు చేపిస్తే ఏం చేస్తాం గ్రామపంచాయతీ నుండి డోర్ నెంబర్లు తెచ్చుకొని కరెంటు మీటర్ తెచ్చుకొని నివాసముంటున్న వారిని ఏమనాలి దీనిపై పంచాయతీ ఈవో సర్పంచ్ వార్డు మెంబర్లు సమాధానం చెప్పాలని ఎన్నోసార్లు లెటర్లు రాయడం జరిగింది అని చెప్పుకొచ్చారు




