తెలంగాణ

హైదరాబాదును ముంచి ఎత్తిన వాన…. కాలనీలన్నీ జలమయం

 

 ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉదయం నుండే
 ప్రారంభమయ్యాయి ఎడ తెరిపి లేకుండా ఉదయం నుంచి సాయంత్రం 8 గంటల వరకు
కూడా ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది ముఖ్యంగా సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతాలలో
 ఎక్కువగా వర్షం కురిసింది ఈ వర్షం దాటికి రహదారుల పైన నీరు నిలిచిపోయింది బేగంపేట
సనత్ నగర్ ఎస్ ఆర్ నగర్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది దాదాపు
ఎడతెరిపి లేకుండా ఎనిమిది గంటలసేపు వర్షం కురిసింది ఈ వర్షం దాటికి ప్రజలు ఎవరు ఇల్లు
వదిలి బయటకు రాలేదు. రోడ్లపైన జిహెచ్ఎంసి వారేసిన మట్టి వాన దెబ్బకి కొట్టుకుపోయి గుంతలు
 మిగిలాయి కొత్తగా రోడ్డుపైన వచ్చే వాహనదారుల పరిస్థితి దయనీయంగా మారింది రోడ్లు గుంటలు
పడినప్పుడు దాన్ని మట్టితో కాకుండా సిమెంట్ తోటో కంకరతోనో పూచి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది
 కాదు తిరిగేది మేం కాదు కదా అని అన్నట్టుగా గుంతలకు మట్టితో రిపేరు చేసి ప్రజలకు ఇబ్బంది
పెట్టారు వర్షం తగ్గే పరిస్థితిలో లేక బయటికి పోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వం రోడ్డు మీద వ్యాపారం చేసే వారి దగ్గర నుంచి టాక్స్ వసూలు చేస్తున్నారు శానిటేషన్
సిబ్బంది రోజు వారి దగ్గర శుభ్రం పేరుతో మరికొన్ని డబ్బులు వసూలు చేస్తున్నారు వర్షం కురిసే
సమయంలో కూడా టీ అమ్ముకునే వారిని మిగిలిన కిరాణం దుకాణా వారిని మున్సిపాలిటీ సిబ్బంది
 ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker