తెలంగాణ
ఈ కట్టడాలకు పర్మిషన్లు లేవు……. కనీసం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదు

అడిగేవాడు ఎవడ్రా..... ఈ కట్టడాలకు పర్మిషన్లు లేవు....... కనీసం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఇలా కాలో అక్రమ కట్టడాలు! జిహెచ్ఎంసి పరిధిలో ఏ నిర్మాణం జరిగిన తప్పనిసరిగా జిహెచ్ఎంసి అనుమతులు ఉండి తీరాలి .అలా లేకపోతే అధికారులు పనులు ఆపేస్తారు ,అలాగే కూలగొడతారు కూడా, ఇలాంటివి హైదరాబాద్ పరిధిలో ఎన్ని ఉన్నాయో వేళ్ళ మీద లెక్కపెట్టలేంగాని, గోకుల్ ప్లాట్స్ సమీపంలో శేర్లింగంపల్లి నియోజకవర్గానికి చివరిలో ఉన్న ఆ భాగం లో అనుమతులు లేని కట్టడాలు నిర్మిస్తున్నారు.కళ్ళముందే కడుతున్న ఆ విషయం ఎవరికి పట్టదు .ఆ స్థలానికి జిహెచ్ఎంసి పర్మిషన్లు లేవు, పర్మిషన్లు సరే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సైతం లేవు, కానీ అపార్ట్మెంట్లు లేపి వాటిని అమ్మడానికి మార్కెట్ చేయడానికి కొంతమందిని మాత్రం పెట్టుకొని నిరాటంకంగా నిర్భయంగా అడిగేవాడు ఎవడ్రా అని తీరుగా ఇక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి. మరి ఈ అమ్మకాలకు అనుమతులు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ ఇచ్చారా ఇస్తే మరి ఆయన ఏం చెబుతారు, పర్మిషన్లు లేకుండా పేపర్లు లేకుండా దాదాపు 50 లక్షల ఖరీదు చేసే ఒక్కొక్క ప్లాటును నోటరీ పేరు మీద అమ్మేస్తూ డబ్బులు సొమ్ము చేసుకుంటున్న ఒక పొలిటికల్ లీడర్ ని చూసి చూడనట్టు వదిలేయడం మరి ఎమ్మెల్యేకి తగున దీనికి ఏం సమాధానం చెబుతారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ గోకుల్ ప్లాట్స్ కి ఆనుకొని ఉన్న ఈ బిల్డింగుల వ్యవహారంపై ఎవరు స్పందిస్తారు జిహెచ్ఎంసి కమిషనర్ ఆ లేదా హెచ్ఎండిఏ కమిషనర్ ఎవరు స్పందిస్తారు, రియల్ ఎస్టేట్ పేరుతో ప్రజలను దగా చేస్తూ సొమ్ము చేసుకుంటున్న వారిపై కొరడా కురిపిస్తున్న ప్రభుత్వ అధికారులు ,పోలీసులు మరి హైదరాబాదు నడిబొడ్డులో జరిగే ఈ తంతును ఎవరు ఆపుతారు .సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ కట్టడాలునిర్మిణ్గo జరిగాయి కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నాయి, గ్యారెంటీ లేని ఈ అమ్మకాలు తరువాత జరిగే తప్పులకు ఎవరు బాధ్యత వహించాలి అనేది పోలీసులు కూడా కొంత ఆలోచిస్తే మంచిది ముఖ్యంగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ ఎంతో మంచి పేరు సంపాదించుకొని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు మరి ఎమ్మెల్యే గారు ఈ వ్యవహారాన్ని ప్రోత్సహిస్తారా మరి ఆ పని చేసే వారిపై చర్యలు తీసుకుంటారా వేచి చూడాల్సిందే.



