తెలంగాణ

జిహెచ్ఎంసి మేయర్ పరిపాలన పారదర్శకత లేదా?

 జిహెచ్ఎంసి మేయర్ పరిపాలన పారదర్శకత లేదా?
 కాంట్రాక్టర్లకు కార్పొరేటర్లకు రాజీ పడి చేస్తున్నారా
: చెత్త బండి డ్రైవర్ కు లైసెన్స్ అవసరం లేదు...... చెత్త తీసుకెళ్లే వారికి వయసుతో సంబంధం లేదు


: జిహెచ్ఎంసి మేయర్ అంటే హైదరాబాద్ మహానగరానికి ప్రధమ పౌరురాలు ఆమె సర్వాధికారాలు కలిగిన మనిషి అయితే జిహెచ్ఎంసి లో జరిగే అవినీతి అక్రమాలు వీటిపై మేయర్ ఎప్పుడు ప్రత్యేక దృష్టి సాలించినట్లు లేదు కాంట్రాక్టర్లకు కార్పొరేటర్లకు పెద్దపీట వేసి వారి మీద పాలనా భారం పెట్టినట్టుగా అనిపిస్తుంది. నిజానికి నగరంలో శుభ్రత పరిశుభ్రత ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాను చెత్త సేకరణ విషయంలో మేయర్ సరైన అవగాహనతో లేరు రోడ్లు చిమ్మే వారి దగ్గర నుండి చెత్త తీసుకెళ్లే వాళ్ళ దగ్గర వరకు అందరూ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్, ఈ కాంట్రాక్ట్ కు వయసుతో సంబంధం లేదు. చదువుతో సంబంధం లేదు. జీతంతో సంబంధం లేదు. ఎంత తక్కువ జీతానికి పనిచేస్తే అటువంటి వారిని మాత్రమే ఈ పనుల్లోకి తీసుకుంటారు జిహెచ్ఎంసి చెత్త బండి నడిపే ఒక వ్యక్తి ఇంకొక వాహనాన్ని తగిలించి తిరిగి ఆ వాహనదారుడుపై దౌర్జన్యానికి దిగాడు అదేమని లైసెన్స్ అడిగితే మాకు లైసెన్స్ అవసరం లేదు మాకు జిహెచ్ఎంసి కార్పొరేటర్లు మా కాంట్రాక్టర్లు మాకు అవసరం లేదని చెప్పారు అలాగని అతని వయసు 16 నోట్లో గుట్కా ప్యాకెట్ వేసుకొని సరైన చెప్పులు కూడా లేకుండా సాధించాలని బట్టలతో డ్రైవింగ్ చేసుకుంటూ రోడ్లపై తిరుగుతున్నాడు అదే క్రమంలో చెత్త సేకరణకు వెళ్లిన కొంతమంది రావడంతో వారిలో 70 పైన సంవత్సరాలు ఉన్న వ్యక్తి అతని భార్య వారి మనవడు మరొకరు వారి మనవరాలు వీరికి వయసు 16 దాటలేదు ఇదేం పరిపాలన వయసుతో సంబంధం లేకుండా బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం తప్పు కాదా అయితే ఈ బాల కార్మిక వ్యవస్థ జిహెచ్ఎంసిలో లెక్కకు రాదా? ఏం జరుగుతుంది
మీరు చేస్తున్న పరిపాలన ఎటు పోతుంది చెత్త వ్యాపారం చేసే వారిని కాంట్రాక్టర్లుగా నియమించి వారికి సౌలభ్యం కోసం వారి ఇష్టం వచ్చిన వ్యక్తుల్ని పనిలో పెట్టుకునే విధంగా మేయర్ అధికారాలు ఇచ్చారా అంటే కాంట్రాక్టర్లకు తలగ్నట్టే కదా మరో విషయానికొస్తే కార్పొరేటర్లు వారి పైరవీలు అంతా ఇంతా కాదు ఎక్కడపడితే అక్కడ ఖాళీ స్థలంలో కబ్జాలు చేసేస్తూ అడిగిన వారిని లెక్క పత్రం లేకుండా ఎదిరించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు నగర మేయర్ తన విచక్షణాధికారాలను మర్చిపోయి కేవలం చూసి చూడనట్టు పోయే విధంగా పరిపాలన చేస్తే హైదరాబాదు లాంటి మహానగరం ఏమైపోతుంది ఎక్కడికి పోతుంది ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ హైదరాబాద్ మహానగరంలో ఉంటూ వారి కార్యక్రమాలను చేసుకుంటుంటారు వీరిద్దరి సౌలభ్యం ప్రజల సౌలభ్యం కోసమైనా మేయర్ ఒక్కసారి శానిటేషన్ సిబ్బందిని మరియు కాంట్రాక్టర్ల దగ్గర చేస్తున్న సిబ్బందిని ఒక ప్రత్యేక సమావేశం పెట్టి వారి బాధలు వారికి ఉండే బాధ్యతలు వారు చేయవలసిన పనులు గురించి ఒక్కసారి వారితో మాట్లాడితే వారి కష్ట సుఖాలు తెలుస్తాయి ఎంత నష్టపోతుంది హైదరాబాద్ మహానగరం అనేది మేయర్ కు స్పష్టంగా తెలుస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker