All

ఉంగుటూరు ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు

 కృష్ణా జిల్లా ఉంగుటూరు మండల ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు
 చేపట్టారు. గత కొంత కాలంగా ఎంపీడీఓ కార్యాలయంపై పలు అవినీతి, అక్రమాలపై… స్పందన, టోల్
 ఫ్రీ నంబర్‌తో పాటు ఏసీబీ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఏసీబీ సోదాలు చేపట్టింది.
గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులు కాంట్రాక్టర్లు మరియు అధికారుల మధ్య సయోధ్యతో
వసూళ్లు బాగా చేస్తున్నట్టు తెలియవచ్చి అకస్మాత్తుగా అర్ధరాత్రి 2:30 గంటల వరకు సోదాలు
జరిగాయి. ఏసీబీ ఆడిషినల్ ఎస్పీ మహేశ్వరరాజు, డీఎస్పీ
 శరత్ బాబు పలు రికార్డులను పరిశీలించారు. ముఖ్యంగా జాతీయ ఉపాధి హామీ పథకంలో జరిగిన
 అక్రమాలపై రికార్డులను పరిశీలించారు. సోదాల్లో భాగంగా పలు గ్రామాల్లో అక్రమాలు జరిగినట్లు
ఏసీబీ అధికారులు గుర్తించారు. గారపాడు, ఇందుపల్లి, పెద్దఆవుటపల్లి గ్రామాల్లో ఉపాధి హామీ
పనుల్లో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ డీఎస్పీ శరత్ బాబు వెల్లడించారు. ఈరోజు కూడా ఉంగుటూరు
 మండలంలోని పలు గ్రామాలలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker