Allసినిమాలు

‘స్క్రీన్ ప్లే’. చిత్రానికి‘ఆఫ్ ఏన్ ఇండియన్ లవ్ స్టొరీ’ అన్నది ట్యాగ్ లైన్




పరిశ్రమ ప‌రిశ్ర‌మ‌లో ‘స్క్రిప్ట్ డాక్టర్’గా సుప్రసిద్ధులైన కె.ఎల్.ప్రసాద్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, బుజ్జి బుడుగు ఫిలిమ్స్ పతాకంపై డాక్టర్ అరుణకుమారి నిర్మించిన చిత్రం ‘స్క్రీన్ ప్లే’. ఈ చిత్రానికి‘ఆఫ్ ఏన్ ఇండియన్ లవ్ స్టొరీ’ అన్నది ట్యాగ్ లైన్ 
విక్రమ్ శివ-ప్రగతి యాదాటి హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. 

కాగా ఈ చిత్ర ట్రైలర్ ను బుధ‌వారం ప్రసాద్ ప్రసాద్స్ గ్రూప్స్ అధినేత రమేష్ ప్రసాద్ విడుద‌ల చేసారు. సుప్రసిద్ధ రచయిత పరుచూరి గోపాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్, ప్రఖ్యాత రచయిత విజయేంద్రప్రసాద్, జె.కె.భైరవి, ఆర్.నారాయణ మూర్తి, సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ, హీరో విక్రమ్ శివ, హీరోయిన్ ప్రగతి యాదాటి, నిర్మాత డాక్టర్ అరుణకుమారి, నటుడు-దర్శకుడు కె.ఎల్.ప్రసాద్ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిన సినిమా అని అన్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సావాల్లో ప్రదర్శితమైన ఈ చిత్రం మన తెలుగు సినిమాకు గర్వకారణం అని, మూడే మూడు పాత్రలతో రెండు గంటలు కట్టి పడేసే ఒక అద్భుతం అని అన్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker