తెలంగాణ
సిద్దిపేట జిల్లాలో 20 మందికి కరోనా పాజిటివ్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మైనార్టీ గురుకుల పాఠశాలలో 20 మంది బాలికలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది సోమవారం పాఠశాలలో జ్వరంతో ఉన్న విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేసుకోగా మొదట ముగ్గురుకి పాజిటివ్ రావడంతో అప్రమత్తమైన సిబ్బంది వైద్య శిబిరం గురుకుల పాఠశాలలో చేయగా మొత్తం 172 మంది విద్యార్థులు 39 మంది బోధన సిబ్బంది ఇతర సిబ్బంది రాపిడ్ టెస్ట్ లు నిర్వహించడంతో అందులో 16 మంది విద్యార్థులు ఇద్దరు జూనియర్ లెక్చరర్లు మరో ఇద్దరు ఇద్దరు సిబ్బంది పాజిటివ్ నిర్ధారణ అయింది అని ప్రిన్సిపల్ రమాదేవి మీడియాతో చెప్పారు విద్యార్థి విద్యార్థులను వారి ఇళ్లకు పంపిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు


