పోలీసు ఉన్నతాధికారులే సరిగ్గా లేరు..,.. చైన్ స్నాచింగ్ చేసేవారిని పోలీసులు పట్టుకున్నదే లేదు

హైదరాబాదులో జిహెచ్ఎంసి పరిధిలో చైన్ స్నాచర్ల ఆగడాలు మితిమీరిపోయాయి మంగళవారం నాడు కూడా కొండాపూర్ గచ్చిబౌలి రామచంద్రపురం ఎంఐజి లాంటి పెద్ద పెద్ద ఏరియాల్లో చైన్స్ నేచర్లు రెచ్చిపోతున్నారు పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుంటున్నారు పక్కన పెట్టేస్తున్నారు ఆ తర్వాత దొంగలు దొరికిన కేసులు పెట్టిన వారిని పిలిచి ఎవరి చైన్ వారికి ఇచ్చిన పాపను పోలేదు మరి రికవరీ చేసిన బంగారాన్ని పోలీసులు ఏం చేస్తున్నారు కేసులు సంఖ్య పెరుగుతుంది తప్ప రికవరీలు లేవు మహిళలు బయటకు రావాలంటే భయభ్రాంతులైపోతున్నారు ఒకే వాహనంపై ముగ్గురు ,ఇద్దరు ముఖం నిండా మాస్కులు పెట్టుకొని గల్లీలో తిరిగే మహిళలను టార్గెట్ చేస్తున్నారు సీసీ కెమెరాలు హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో ప్రతి గల్లీ గల్లీకి ఉన్నాయి కానీ ఒక్క దొంగ పట్టుబడ్డడా, ఏదో విధంగా పట్టుబడ్డ దొంగలు వారిని ప్రేరేపిస్తున్న వారు ఎక్కడున్నారు అని వెతికి తీశారా ఏ విషయం నైనా చాలా తొందరగా నిజాన్ని నిగ్గు తేల్చే పోలీసులు చాలామంది కష్టపడి పని చేసే వారు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి అలాంటి వారిని హైదరాబాద్ లాంటి నగరాలలో డ్యూటీలు వేస్తే ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారు. కానీ హైదరాబాద్ నగరంలో పనిచేసే ఉన్నతాధికారులలో చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు దొంగలకు సహాయపడేవారు పెద్ద హోదాలోనే ఉన్నారు అలాంటివారు వచ్చిన తర్వాత కేసులు ఎక్కువ పరిష్కరించడం తక్కువవుతుంది. సజనార్ లాంటి వ్యక్తి సిటీ నుండి వెళ్లిపోయిన తర్వాత కేసులు పెరిగాయి అంటే ఆలోచించుకోండి మన దగ్గర ఉండే అధికారులు మారు మూల ప్రాంతాల్లో సంగారెడ్డి నియోజకవర్గం లోని కొండాపూర్ లాంటి మండలాల్లో కొన్ని సంవత్సరాలుగా వ్యాపారాలు చేస్తున్నారు మరి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు నేరస్తులు ఎలా తగ్గుతారు




