
కరోనా కేసులు భారతావనిలో పెరుగుతున్న నేపథ్యంలో దీనిని కట్టడి చేయడం కోసం పౌరులు వీలున్నంత రోడ్లపైకి రావద్దని ఆదేశాలు జారీ చేసిన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ క్రమంలోనే జనసమూహాలను నియంత్రించే పనిలో పడ్డాయి. ఇప్పటికే స్కూళ్లు, సినిమా థియేటర్లు మూతపడగా.. తాజాగా దేశ వ్యాప్తంగా పలు ఆలయాలు సైతం మూసివేస్తుండటం గమనార్హం.
తాజాగా గురువారం నుంచి చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఓ ప్రకటన విడుదల చేస్తూ ఈ నెల 25 వరకు ఆలయం మూసివేయాలని నిర్ణయించామని, స్వామి వారి ఆరాధన, నైవేద్య కార్యక్రమాలు కేవలం అర్చకులు మాత్రమే నిర్వహిస్తారని తేల్చి చెప్పారు. స్వామివారి ప్రదక్షణలు నిలపివేసామని ఆలయానికి ఎవరూ రావద్దని ఆయన ఈ ప్రకటనలో కోరారు.




