తెలంగాణ

జిహెచ్ఎంసి లో చెత్త వ్యాపారం…

*జిహెచ్ఎంసికి సంబంధం లేని వ్యక్తుల చేతుల్లో చెత్త ట్రాలీలు

*చెత్త తీసుకెళ్తే గడపకి 100 రూపాయలు

*జిహెచ్ఎంసి ఉద్యోగుల లీలల్లో ఇదో కోణం

*ఇంటింటికి చెత్త సేకరణ చేసే టందుకు జిహెచ్ఎంసి కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేసింది
వారికి చెత్త ట్రాలీ ఇచ్చింది దానికి ఒక డ్రైవర్ను ఇచ్చింది డ్రైవర్ చెత్త సేకరించే వ్యక్తి మరో
ఇద్దరు లేదా ముగ్గురు ప్రైవేటు వ్యక్తులు కలిసి చెత్త సేకరిస్తారు, ఈ సేకరించే సమయంలో
ఇంట్లో ఒక గడపకి ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాల వారు ఒక్కొక్కరు నెలకు 100 రూపాయలు
చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది ఇది వారి నియమ నిబంధన కచ్చితంగా అమలు చేయాల్సిందే డబ్బులు
ఇవ్వకపోతే చెత్త తీసుకుపో ము అంటూ చెత్తను సేకరించే జిహెచ్ఎంసి సిబ్బంది వారి తోటి వచ్చే ప్రవేట్
సిబ్బంది చేస్తున్న నిర్వాకం. అలాగని రోజు చెత్తను సేకరిస్తారా అంటే సేకరించరు ఎందుకంటే వారికి
హైదరాబాదు లాంటి మహానగరంలో ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క వ్యక్తి అండర్ లో పెట్టుకొని వారు
అక్కడినుండే కార్పొరేటర్, ఎమ్మెల్యే, లేదా మేయర్ లాంటి పెద్ద వ్యక్తుల ఆశీర్వాదంతో వారు ఏరియాను
విభజించుకుని వ్యాపారాలు ప్రారంభిస్తారు రోడ్లు ఊడవరు కానీ చెత్త తీసుకుపోవడానికి రెండు రోజులకు
ఒకసారి వస్తారు ఈ లోపల హాస్పిటల్స్, మార్కెట్లు, హోటల్లు, స్కూల్స్, పరిశ్రమలు లాంటి వాటి దగ్గర
చెత్తను సేకరించి అక్కడ చేయాల్సిన పనులు పూర్తి చేసుకొని ఆ తర్వాత మరలా తిరిగి ఇళ్లల్లో ఉండే
చెత్తను సేకరించడానికి వస్తారు ఒక్కొక్క చెత్త సేకరణ ర్యాలీకి జిహెచ్ఎంసి కి సంబంధించి ప్రైవేటు
లేదా ప్రభుత్వ ఉద్యోగి అయినా ఒక్కరే ఉంటారు మిగిలిన ముగ్గురు లేదా నలుగురు వారికి ప్రైవేటు
వ్యక్తులను జతచేసుకొని ఇళ్లల్లో చెత్తను తీయడానికి వెళతారు ఉద్యోగాలు లేని ,సమయంలో పనులు
లేని , ఇలాంటి చెత్తను తీసుకువెళ్లే పని చేయటం మంచిదైనప్పటికీ వచ్చే ప్రైవేటు వ్యక్తులు
మంచివారా చెడ్డవారా దొంగల ఎవరు అనేది తెలియరాదు విజిల్ వేసుకుంటూ చెత్తను
సేకరించుకుంటూ వారి పని వారు చేసుకుంటారు తర్వాత జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు
జిహెచ్ఎంసి కాంట్రాక్టర్లు శానిటరీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారిని కూర్చోబెట్టి రోడ్డుమీద
కూల్ చేసుకునే వారిని తీసుకువచ్చి ఇటువంటి పనులు చేపిస్తుంటారు చెత్త సేకరణ వ్యవస్థపై
ఒక పర్యవేక్షణ లేదు ట్ర్యాలీల మీద వాటిమీద పనిచేసే వ్యక్తుల మీద జిహెచ్ఎంసి శానిటరీ ఉద్యోగులకు
ఎటువంటి నియంత్రణ పర్యవేక్షణ లేవు అన్నిటిని గాలికి వదిలేసి వారు తీసుకొచ్చే సొమ్ము మీద
ఆశపడి నియమ నిబంధనలను అటకెక్కిస్తున్నారు సేకరణ వాటి పనులు అవన్నీ జిహెచ్ఎంసి
స్వయంగా ఉంటుందా లేక ఏదైనా ఒక వ్యవస్థకు అప్పజెప్పిందా అనేది రెండవ వాదన మొదటైతే
చేయాల్సింది పర్యవేక్షణ చూడాల్సింది జీతం తీసుకునే ఉద్యోగుల పనితీరు పనిచేస్తుంది ఒకరు
జీతం తీసుకుంటుంది మరొకరు జీతం ఒక వ్యక్తికి 50 నుండి 60000 నెలకు ఉంటే వారు తీసుకొచ్చే
వ్యక్తి కి వీరిచ్చే జీతం నెలకు 10,000 ఉంటుంది అంటే ఇంట్లో కూర్చొని ప్రతినెల 50 వేల రూపాయలు
తింటున్నారు ఇది కాకుండా చెత్త వ్యాపారం చేస్తూ చెత్తలో సంపాదించే సొమ్ము లక్షల్లోనే ఉంటుంది
వీటన్నిటికీ మూల సూత్రధారులు పనిచేసే ప్రధాన ఉద్యోగులే అనుకోవాలా లేకుంటే మేయర్
కార్పొరేటర్ లాంటివాళ్ళు తో చెత్త తీసే వాళ్ళు కుమ్మక్కై నడిపిస్తున్నారు ఆ దేవుడికి తెలియాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker