Allవార్తలు

మధ్యాహ్న భోజనంలో పెరగనున్న నాణ్యత..

మధ్యాహ్న భోజనం నాణ్యతపై గ‌తంలో ముఖ్య‌మంత్రి  ఇచ్చిన  ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివ‌రించారు.   రూ.200 కోట్లు అదనంగా ఖర్చుతో మెనూలో ప‌లు మార్పులను తీసుకువ‌చ్చిన‌ట్టు వివ‌రించారు.  సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకోసం ఆహారాన్ని నాణ్యంగా వండటానికి ఆయాలకు రూ.3వేల చొప్పున జీతాలు చెల్లిస్తు రూ. 343.55 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నట్టుతెలిపారు. ఫిబ్రవరి 20 నుంచి ఏపిలో  మ‌ధ్యాహ్న భోజ‌నం అమ‌ల‌య్యే అప్ని పాఠ‌శాల‌లో నాణ్యమైన భోజనం అందించే ఏర్పాటు జ‌రుగుతోంద‌ని ఇందుకు  మొత్తంగా రూ. 1294 కోట్లు ఖర్చు అవుతుందని అంచ‌నాలు వేసిన‌ట్టు వివ‌రించారు. 
 అధికారులు ముఖ్యమంత్రికి అందించిన మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కంలో మెనూ వివరాలు… ఇలా ఉన్నాయి
★ సోమవారం : అన్నం, పప్పుచారు,  ఎగ్‌ కర్రీ, చిక్కి.
★ మంగళవారం :  పులిహోర, టమోటా పప్పు, ఉడికించిన గుడ్డు.
★ బుధవారం : కూరగాయల అన్నం, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి
★ గురువారం : కిచిడి (పెసరపప్పు అన్నం), టమోటో చట్నీ, ఉడికించిన గుడ్డు.
★ శుక్రవారం : అన్నం, అకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి.
★ శనివారం : అన్నం, సాంబార్, స్వీట్‌ పొంగల్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker