
మెగా స్టార్ చిరంజీవి అంటే ఆమెకు వీరాభిమానం. చిన్నప్పుడే ఆమె చిరంజీవి ఫోటోల మధ్య పెరగటమో ఏమో! వయసుతో పాటు ఆమె అభిమానం కొండంత అయ్యింది. ఎంతలా అంటే ‘జై చిరంజీవా’ అంటూ చేతికి పచ్చ బొట్టు పొడిపించుకునేంత. అమే అక్షత శ్రీనివాస్.
మెగా ఫ్యాన్ గా అందాల భామ అక్షత శ్రీనివాస్ హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం ‘సురభి 70 ఎం.ఎం చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలోనూ తన మెగా అభిమానాన్ని చాటుకునేలా తన పాత్ర పేరును చిరంజీవి సూపర్ హిట్ సినిమా అభిలాష అని పెట్టుకుంది. అంతేనా మరో సూపర్ హిట్ సినిమా ‘గ్యాంగ్ లీడర్’ ఆమె క్యారక్టర్ కావటం ఓ విశేషం. ఇంతకీ ఈ అభిలాష కథేంటి? చిరంజీవి కోసం చచ్చిపోయేంతగా పెంచుకున్న మెగాభిమానం ఆమెకు చేసిన మేలేంటి? ‘గ్యాంగ్ లీడర్’ గా ఆమె ఎందుకు మారాల్సి వచ్చింది? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. ‘సురభి 70 ఎం.ఎం’ చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు వై.గంగాధర్.
‘సురభి 70 ఎం.ఎం’ అనే ధియేటర్ ను కబ్జా చేసేందుకు ప్రయత్నించే ఓ రౌడీని మెగా ఫ్యాన్ అయిన అక్షత శ్రీనివాస్ తన గ్యాంగ్ తో ఎలా ప్రతిఘటించింది? ఆ క్రమంలో ఆమె ‘గ్యాంగ్ లీడర్’ ఎలా అయ్యింది అనేది ముఖ్య కథ.తో రూపొందుతున్న ఈ సినిమా పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
ఈ సినిమాకి సంబంధించిన విశేషాలను యువ కథానాయకి అక్షత శ్రీనివాస్ మీడియాకు వివరిస్తూ…. ‘స్వతహాగ నిజ జీవితంలో మెగా స్టార్ కు పెద్ద ఫ్యాన్ అయిన నాకు ‘సురభి 70 ఎం.ఎం’లో మెగాభిమానిగా గ్లామర్ తోపాటు నటనకు ప్రాధాన్యత కల ‘అభిలాష’ అనే పాత్రలో ‘లేడి గ్యాంగ్ లీడర్’గా నటించే అవకాశం రావడం అదృష్టంమని అన్నారు. ఈ చిత్రం నా కెరీర్ ను మలుపు తిప్పుతుందని నమ్మకంగా ఉందని అన్నారు. చిన్నప్పటి నుంచి చిరంజీవినే గురువుగా భావించి నటన వైపు ఆసక్తి చూపానని, అదే తనని హీరోయిన్‌ని చేసేలా చేసిందని అన్నారు. తన అభిమాన హీరో మెగాస్టార్ తాజా చిత్రం ‘గోవింద్ ఆచార్య’ బాక్సులు బద్దలైపోవాలని కోరుకుంటున్నా, భవిష్యత్‌లో చిరంజీవితో పాటు కనీసం ఓ చిన్న క్యారెక్టరైనా చేయాలనుందని అభిలషించింది అక్షత.




