తెలంగాణ
నిత్యపెళ్లికొడుకు శివశంకర్ అరెస్ట్….
నిత్యపెళ్ళికొడుకు శివ శంకర్ బాబును గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రాష్ట్రాల్లో కలిపి 13 మంది యువతులను శివ శంకర్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లిళ్లు చేసుకొని శారీరక సుఖాన్ని అనుభవించి వారి నుంచి డబ్బులు తీసుకొని పారిపోతూ మోసానికి పాల్పడ్డాడు. అతడిపై హైదరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, గుంటూరు, విజయవాడలో కేసులు నమోదు అయ్యాయి. ఇటీవల కాలంలో శివశంకర్ బాబును అరెస్ట్ చేయాలంటూ బాధిత మహిళలను రోడ్డెక్కారు. అమెరికాలో ఉన్న యువతిని కూడా శివశంకర్ మోసం చేశాడు. హైదరాబాద్ చెందిన అమెరికాలో ఉంటున్న యువతి దగ్గర్నుంచి 35 లక్షలకు నిత్యపెళ్లికొడుకు వసూలు చేశాడు.




