తెలంగాణముఖ్యాoశాలు

 జిల్లా అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా దూసుకెళ్తున్న  కలెక్టర్  “యాస్మిన్ పాషా”

సమస్యలు తెలుసుకుని వాటికి అనుగుణంగా నడుచుకుంటూ పెద్ద, చిన్న అని తేడాలు లేకుండా జిల్లా అభివృద్ధి లక్ష్యంగా
 మహిళా సాధికారత ధ్యేయంగా ప్రజల కష్టనష్టాలు తెలుసుకొని వాటికి ప్రాధాన్యత ఇస్తూ పరిపాలన సాగిస్తున్న వనపర్తి జిల్లా
కలెక్టర్ యాస్మిన్ పాషాను కొనియాడాల్సిందే కరోనా టైంలో జిల్లాను కరోనా రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ఆమె తీసుకున్న
 చర్యలు పడిన కష్టం జిల్లా అధికారులతో కలిసి చిన్నాచితక అనే బేధం లేకుండా  అందరితో మమేకమై జిల్లాను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు మహబూబ్నగర్ జిల్లా నుండి విడిపోయి వనపర్తి జిల్లాగా ఏర్పడి జిల్లాకి కొత్త కలెక్టరేట్ లో మొదటిసారిగా బాధ్యతలు తీసుకున్న కలెక్టర్ , ముఖ్యమంత్రి చేతుల మీదుగా పదవి బాధ్యతలు చేపట్టి జిల్లా అభివృద్ధికి ఆమె కృషి చేస్తున్నారు
జిల్లాలో 14 మండలాలు 255 గ్రామపంచాయతీలు ఉన్నాయి కొత్తగా వీటిలో 79 గ్రామపంచాయతీలు ఏర్పాటు చేశారు జిల్లాలో
శానిటేషన్ మంచినీరు ఆరోగ్యం విద్యా పట్ల కలెక్టర్ నిశితంగా పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నారు కలెక్టర్ యాస్మిన్ భాష.
మొదటి ప్రాధాన్యత గ్రీవెన్స్కు ఇస్తున్నారు అధికారులు పనిచేయాలన్న, సమస్యలు తెలియాలన్నా మొదట చూడవలసింది ప్రజల యొక్క గ్రీవెన్స్ వాటిపై కలెక్టర్ పూర్తిగా సమయాన్ని కేటాయిస్తున్నారు గతంలో మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడిగా ఉన్నప్పుడు మూడు సంవత్సరాల పాటు అక్కడ అధికారిగా పని చేశారు, ఆ తరువాత జాయింట్ కలెక్టర్ హోదాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు సంవత్సరాలు పని చేశారు, మహిళలు వారి సమస్యలు పట్ల కలెక్టర్కు పూర్తి అవగాహన మహిళలను ఎలా చైతన్యవంతులను చేయాలి వారిపై జరుగుతున్న దాడులను ఎలా తిప్పి కొట్టాలి తల్లిగా చెల్లిగా అమ్మగా భార్యగా ఆడవాళ్లు ఎంతో సేవ చేస్తున్నప్పటికీ ఇంట్లో తల్లిదండ్రి పెంచే పెంపకం మీద పురుషుల ఆదిపత్యం నడుస్తూ ఉంటుంది ప్రతి ఒక్క మహిళ తన బిడ్డను పెంచే విధానాన్ని పూర్తిగా క్రమశిక్షణ పద్ధతిలో పెంచితే మహిళలపై ఇటువంటి దాడులు జరగవు  అని ఆమె అభిప్రాయపడతారు.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చట్టం న్యాయం ఎన్నిచేసినా తల్లిదండ్రి పుట్టినప్పటినుంచి బిడ్డను పెంచే విధానంలో మార్పులు తీసుకురాకపోతే సమాజంలో ఆడవారిపై దాడులు జరుగుతూనే ఉంటాయి ఆ దాడులు ఆపాలంటే దానికి పూర్తి పరిష్కారం మహిళలే చూసుకోవాలి మహిళ చేతుల్లోనే ఉంది చదువుకోనక్కర్లేద ఉద్యోగాలు చేయనక్కర్లేదు పదవులు అలంకరించిన అక్కర్లేదు సమాజాన్ని కాపాడడానికి తన కుటుంబంలో పెరిగే కొడుకును కూతురును క్రమశిక్షణతో పెంచితే ఆ కుటుంబంతో పాటు సమాజం కూడా బాగుపడుతుంది అలాగా మహిళలను చైతన్యవంతులను చేస్తూ ఆర్థికంగా బలపడటానికి ప్రభుత్వం ఇస్తున్న వివిధ రకాల పథకాలు ఉపయోగించుకొని ఒక మంచి వాతావరణాన్ని సమాజానికి ఇవ్వవలసిన ఆవశ్యకత
 మహిళలపై ఎంతైనా ఉందని ఆమె అభిప్రాయ పడుతున్నారు.
రెవిన్యూ సమస్యలు ల్యాండ్ ఆక్విజిషన్  సమస్యలు శానిటేషన్ సమస్యలు అన్ని చోట్ల ఉండేయనని వాటన్నిటినీ జిల్లా అధికారులతో కూర్చుని ఎప్పటికప్పుడు సమస్యలు లేకుండా ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ కలెక్టర్ ముందుకు సాగిపోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ముఖ్యంగా వనపర్తి జిల్లా మొదటి
 స్థానంలో ఉండడానికి కలెక్టర్ చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పొచ్చు . ఉండేది చిన్న జిల్లా అయినా ప్రజల అవసరాలు ఎప్పటిలాగే ఉంటాయి వాటిని తెలుసుకుంటూ సమాజంలో అందరికీ అందుబాటులో ఉన్నామని చెప్పుకుంటూ అధికారులను ముందుకు నడిపించుకుంటూ జిల్లాని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker