ఆంధ్రప్రదేశ్ముఖ్యాoశాలు
విద్యార్థులు కట్టిన ఫీజులు సహా అన్ని శాఖల నిధులు పీడీ ఖాతాలోకే

జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే మాయను పదేపదే ప్రదర్శిస్తోంది. పీడీ ఖాతాల పేరుతో నిత్యం నిధులను భారీఎత్తున మళ్లించుకుపోతోంది. కేంద్ర పథకాల నిధులు మొదలు ఉద్యోగులు దాచుకున్న సొమ్ములవరకు దేనినీ వదలిపెట్టడం లేదు. చివరకు కొవిడ్ అవసరాలకు ఉద్దేశించిన విపత్తు నిధులనూ లాగేసుకుంది. 2020-21లో ఎస్‌డీఆర్‌పఫ్ ఖాతా నుంచి కొవిడ్ బాధితుల కోసం నిర్దేశించిన నిధులను వ్యవసాయ శాఖ పీడీ ఖాతాలోకి మళ్లించిన వ్యవహారంపై స్వయంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని.. జగన్ సర్కారుకు చీవాట్లు పెట్టిన విషయం తెలిసిందే. పీడీ ఖాతాకు మళ్లించిన రూ. 1100 కోట్లను తిరిగి జమ చేయాలని ఆదేశించింది.
అయితే.. సాక్షాత్తూ కోర్టులు సహా అన్ని విభాగాలు, శాఖల నుంచి చిల్లిగవ్వతో సహా లాక్కుని… నిర్దేశించిన అవసరాల కోసం కాకుండా ప్రభుత్వం తన సొంత ఖర్చులకు వాడుకుంటోంది. అలా వేలాది కోట్లను తీసేసుకుంటోంది. యూనివర్సిటీల నిధులు, విద్యార్థులు కట్టిన ఫీజులు సహా అన్ని శాఖల నిధులను పీడీ ఖాతాల సాయంతో జగన్ సర్కార్ మళ్లించింది. ఇప్పుడు కొత్తగా గత ఆర్థిక సంవత్సరం నుంచి వైసీపీ ప్రభుత్వం పీడీ ఖాతాల ముసుగులో అప్పటికే చేసిన అప్పులను తక్కువ చేసి చూపిస్తోంది. పీడీ ఖాతాల్లో నిధులంటే ప్రభుత్వం కంప్యూటర్‌లో లెక్కలు మార్చడమే. కంప్యూటర్‌లో జీరో చేేస్త ఆ పీడీ ఖాతాకింద నిధులన్నీ ఖర్చైపోయినట్టే లెక్క. కానీ, విచిత్రంగా మార్చి 31వ తేదీ వచ్చేసరికి పీడీ ఖాతాలు ఉన్నట్టుండి ఖాళీ అవుతున్నాయి కానీ, ఖర్చు మాత్రం పెరగడం లేదు. ఒక చోట నిధులు తగ్గాయి అంటే మరోచోట ఆ ఖర్చు కనిపించాలి కదా ? కానీ, వైసీపీ ప్రభుత్వంలో అలా కాదు. వేల కోట్ల నిధులు ఉన్నట్టుండి ఖాతాల నుంచి మాయమవుతాయి. కానీ, ఖర్చు మాత్రం పెరగదు.
ఒకటీ రెండు వారాల తర్వాత వేల కోట్ల నిధులు ఉన్నట్టుండి పీడీ ఖాతాల్లో ప్రత్యక్షమవుతాయి. ఈ సందర్భంలో సాధారణంగా అయితే, బడ్జెట్ హెడ్‌లో ఖర్చు నమోదవ్వాలి. కానీ, ఆ హెడ్ కింద ఖర్చే కనపడదు. మూడేళ్ల నుంచి ఇదే మాయ. చివరికి ఏజీ కార్యాలయానికి కూడా ఇవే లెక్కలు పంపుతారు. ఏజీ ఆఫీసులోని అకౌంటింగ్ విభాగం వారు ఇవే లెక్కలు పరిశీలించి నివేదిక ఇస్తారు. కానీ, ఈ లెక్కల్లో నిజానిజాలు ఆధ్యయనం చేయాల్సిన ఆడిటింగ్ విభా గం ఏనాడూ ఆడిటింగ్ చేయదు. ఈ లొసుగుల లోగుట్టును బయటపెట్దదు. ఇలాంటి తప్పుడు లెక్కలతో అప్పులు తక్కువగా చూపించుకుని మళ్లీ పరిమితికి మించి కొత్త అప్పులు చేస్తూ వస్తోంది జగన్ ప్రభుత్వం.
ఇలా తప్పుడు లెక్కలే కొనసాగితే ఒక్కసారిగా ప్రభుత్వం మారితే లెక్కలన్నీ మారిపోతాయి. ఎందుకంటే వచ్చే ప్రభుత్వం పాత ప్రభుత్వం దాచిన లెక్క లు బయట పెట్టాలనుకుంటుంది. జగన్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే టీడీపీ ఐదేళ్ల ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక వివరాలపై శ్వేతపత్రం విడుదల చేసింది. కాగా. ఉద్యోగులకు సంబంధించిన కటింగ్స్ అన్నీ కూడా ప్రభుత్వం వద్ద పీడీ ఖాతాలో ఉంటాయి. వాటిని ఏడాదికి దాదాపు రూ.11,000 కోట్ల చొప్పున ప్రభుత్వమే వాడుకుంటోంది. ఉద్యోగులు వాటి కోసం దరఖాస్తు పెట్టుకుంటే వాటిని ఇస్తుంది. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదటి ఆరు నెలలే ఉద్యోగులకు వారి జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, ఇతర అడ్వాన్సులు, రిటైర్‌మెంట్ ప్రయోజనాలు అందా యి. రెండున్నరేళ్ల నుంచి ఉద్యోగుల డబ్బులు కూడా ఇవ్వడం లేదు. పీడీ ఖాతాలు, వాటి నిర్వహణ ప్రభు త్వం చేతిలో ఉండడం వల్లే ఇలా నిధుల మళ్లింపు జరుగుతోంది. కేంద్ర పథకాల నిధులను కూడా జగన్ ప్రభుత్వం భారీగా మళ్లిస్తుండడంతో అన్ని పథకాలకు కేంద్రం పీడీ ఖాతాలు వద్దనీ ప్రతి పథకానికి ఒక బ్యాంకు ఖాతా తెరిపించింది. బ్యాంకు ఖాతాలైతే ఇలాంటి నిధుల మళ్లింపు జరగదనేది కేంద్రం ఉద్దేశం.




