తెలంగాణ
వినాయక విగ్రహాల తయారీపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని
కోర్టు ఆదేశాలిచ్చింది.జిహెచ్ఎంసి తాను స్వయంగా తయారు చేసి చూపించిన నీటి కుంటల్లోనే
వినాయక నిమజ్జనం చేయాలి పీసీబీ మార్గదర్శకాలను సవాల్ చేస్తూ విగ్రహ తయారీదారులు దాఖలు
చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. పీవోపీ విగ్రహాలు నిషేధిస్తూ ప్రభుత్వం ఇప్పటి వరకు
ఎలాంటి జీవో ఇవ్వలేదని హైకోర్టు పేర్కొంది. పీవోపీ విగ్రహాల నిషేధంపై ఎలాంటి ఉత్తర్వులు
ఇవ్వలేమని న్యాయస్థానం తెలిపింది. విగ్రహాల ఎత్తు తగ్గించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న
ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.


