తెలంగాణముఖ్యాoశాలు

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండండి….. రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌

సైబర్‌ మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ సూచించారు.
 ఈ మేరకు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్‌(ఆర్‌కేఎస్సీ) ఉమెన్స్‌ ఫోరం ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన
 ఆన్‌లైన్‌ (వర్చువల్‌) అవగాహన సదస్సులో సీపీ పాల్గొని మాట్లాడారు.అన్ని మోసాల పైన ఒక కన్నేసి ఉంచాలి
సైబర్ నేరగాళ్లకు అవకాశాలు ఇయ్యద్దు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్‌లోని ఐటీ కంపెనీలు, ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ ప్రతినిధులు సహా.. 678 మంది ప్రతినిధులు ఈ వర్చువల్‌ సదుస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్‌ నేరాలు, గిఫ్ట్‌ఫ్రాడ్స్‌, సోషల్‌ మీడియా వేధింపులు, మహిళలపై జరుగుతున్న నేరాలు, జాబ్‌ ఫ్రాడ్స్‌, ఆర్థిక నేరాలపై అవగాహన కల్పించారు. వాటి బారినపడకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఆర్‌కేఎస్సీ ఉమెన్స్‌ ఫోరం జాయింట్‌ సెక్రటరీ లలితా రామసుబ్రహ్మణ్యం , కోఆర్డినేటర్‌ అర్చనా మన్నె తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker