తెలంగాణముఖ్యాoశాలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై మరోసారి ఫైర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై మరోసారి ఫైర్అయ్యారు.
ప్రోటోకాల్‌ను పాటించడంలేదని ఆరోపించారు. సోమవారం ఆమె ఇక్కడ మీడియాతో
మాట్లాడుతూ మొట్ట మొదటిసారిగా ఒక గిరిజన మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయ్యారని,
ఇది దేశం గర్వించదగిన అంశమని అన్నారు. తాను తెలంగాణ ప్రథమ పౌరురాలిగా బాధ్యతతోనే
వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లానన్నారు. ఈ దఫా పర్యటనలో కూడా అధికారులు ప్రోటోకాల్
పాటించలేదని మండిపడ్డారు. ప్రగతి భవన్ , రాజ్‌భవన్ గ్యాప్‌పై తానిప్పుడేమీ వ్యాఖ్యానించనని
అన్నారు.కెసిఆర్ ఏం చేసినా ఎలా మాట్లాడినా నేను ప్రజలకు సహాయం చేస్తూనే ఉంటానని
అని చెప్పుకొచ్చారు వరదలకు క్లౌడ్‌బస్టర్ కారణం అన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తాను బరెస్ట్ కానని,
వరదల వల్ల నష్టపోయిన తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తూనే ఉందన్నారు.
వరదలవల్ల కలిగిన నష్టంపై కేంద్రానికి ఇప్పటికే నివేదిక పంపించానన్నారు. ఇటీవల ప్రధాని
హైదరాబాదు పర్యటనలో రాజకీయాలపై చర్చించారా అన్న మీడియా ప్రశ్నకు తాను
స్పందించనని గవర్నర్ తమిళి సై సమాధానం ఇచ్చారు.




